Telugu Global
Cinema & Entertainment

Toofan | ఇది రామ్ చరణ్ సినిమా కాదు

Toofan Movie - తూఫాన్ అనగానే ఎవరికైనా రామ్ చరణ్ మూవీ గుర్తొస్తుంది. ఇప్పుడిదే టైటిల్ తో విజయ్ ఆంటోనీ ఓ సినిమా చేశాడు.

Toofan | ఇది రామ్ చరణ్ సినిమా కాదు
X

వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ కు దగ్గరైన హీరో విజయ్ ఆంటోనీ, తుఫాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గా ఆయన లవ్ గురు సినిమా తెలుగులో మంచి టాక్ తెచ్చుకుంది. తుఫాన్ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో తుఫాన్ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్.

తనను చిన్న చూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథ ఇది. ప్రస్తుతం తుఫాన్ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. ఓ దీవి నేపథ్యంగా సాగే ఈ సినిమా షూటింగ్ ను అండమాన్, డయ్యూ డమన్ లలో జరిపారు. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురానున్నారు. ఈ నెల 29న తుఫాన్ సినిమా టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.

విజయ్ ఆంటోనీ సినిమాలన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. అతడు టచ్ చేయని జానర్ లేదు. రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలు చేయడు ఈ హీరో. కంటెంట్ బాగుండే కథలే సెలక్ట్ చేసుకుంటాడు. అందుకే అతడి నుంచి వస్తున్న తుఫాన్ పై అంచనాలున్నాయి.

మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ ఆంటోనీతో కలిసి అచ్చు రాజమణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  20 May 2024 5:08 PM GMT
Next Story