Telugu Global
Cinema & Entertainment

Natanthara | భార్యకు బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చిన విఘ్నేష్ శివన్

Nayanthara - తన పుట్టినరోజుకు ఖరీదైన బహుమతి అందుకుంది నయనతార. స్వయంగా భర్త విఘ్నేష్ ఈ గిఫ్ట్ ఇచ్చాడు.

Natanthara | భార్యకు బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చిన విఘ్నేష్ శివన్
X

విఘ్నేష్ శివన్ నయనతార పుట్టినరోజుకు మెర్సిడెస్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చాడు. నయనతార, విఘ్నేష్ శివన్ జంట బెస్ట్ కపుల్ అనిపించుకుంటోంది. గతేడాది పెళ్లి చేసుకున్న ఈజంట, ప్రతి అకేషన్ ను సెలబ్రేట్ చేసుకుంటోంది. తాజాగా నయనతార తన 39వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది.

ఈ పుట్టినరోజును, భర్త విఘ్నేష్ శివన్, పిల్లలు ఉయిర్, ఉలాగ్‌లతో కలిసి జరుపుకుంది. ఈ సందర్భంగా భార్యకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు విఘ్నేష్. ఏకంగా మెర్సిడెస్ మేబ్యాక్ కారును అందించాడు. దీని ధర దాదాపు 3 కోట్ల రూపాయలు. భర్త తనకు బెంజ్ గిఫ్ట్ గా ఇచ్చిన విషయాన్ని స్వయంగా నయనతార వెల్లడించింది. కారు లోగోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

నయనతార, విఘ్నేష్ శివన్ 2015లో వచ్చిన నానుమ్ రౌడీ ధాన్‌ కోసం కలిసి పనిచేశారు. ఆ టైమ్ లోనే ఇద్దరి మధ్య దోస్తీ కుదిరింది. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట, గతేడాది జూన్ 9న పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే సరోగసీ ద్వారా పిల్లలకు సంబంధించిన ప్రాసెస్ మొదలుపెట్టారు ఈ దంపతులు. అలా పెళ్లి చేసుకున్న 4 నెలలకే, తమకు కవలలు పుట్టారంటూ వీళ్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది.

ఇక సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతోంది నయనతార. ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటోంది. ఆమె నటించిన తాజా చిత్రం అన్నపూర్ణయై రేపు థియేటర్లలోకి వస్తోంది.

First Published:  30 Nov 2023 9:12 PM IST
Next Story