Telugu Global
Cinema & Entertainment

Vidya Vasula Aham | ఓటీటీ రిలీజ్ కు మరో సినిమా రెడీ

Vidya Vasula Aham - రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన సినిమా విద్యా వాసుల అహం. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయింది.

Vidya Vasula Aham | ఓటీటీ రిలీజ్ కు మరో సినిమా రెడీ
X

అహంతో కూడిన ప్రేమ‌క‌థ‌లోని భావోద్వేగాల‌ను, ఇగోల‌ను చూపించ‌డానికి రెడీ అవుతున్నారు విద్య‌-వాసు. మే 17న వీరి ఇగో ప్రేమ‌క‌థ‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదిక‌గా ప్రీమియ‌ర్ కానుంది. వీళ్ల క‌థ‌ని టూకీగా చెప్పాలంటే రాహుల్ విజయ్, శివాని, అసలు పెళ్ళంటే ఇష్టం లేని వాసు, విద్యని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.

కపుల్ అన్నాక ఒకరు తగ్గాలి ఇంకొకరు నెగ్గాలి, కాని ఇద్దరూ నేనే నెగ్గాలి అని అనుకుంటే, అదే ఇగోకి పోతే, ఆ పెళ్లి జీవితంలో ప్రేమ బాధ్యతల మధ్యలో ఇగో వస్తే ఎలా ఉంటుంది అనే నేపధ్యలో కథ జరుగుతుంది. మరీ విద్య వాసులు ఇగో తోనే ఉంటారా లేదా పెళ్ళైన కొత్తలో ఉండే మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తారా అనేది తెలియాలంటే ఆహాలో మే 17 వ‌రల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్ అయ్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మహేష్ దత్త నిర్మించిన ఈ సినిమాకు మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఏ లాంగ్ లాంగ్ ఈగో స్టోరి అనే ట్యాగ్ లైన్ పెట్టారు. కల్యాణి మాలిక్ ఈ సినిమాకు సంగీతం అందించాడు

First Published:  12 May 2024 5:48 PM
Next Story