Telugu Global
Cinema & Entertainment

ఆ వీడియోలతో నాకు సంబంధం లేదు

నాకు సంబంధించిన పలు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయని, అవన్నీ ఏఐ జనరేటెడ్‌వి అన్న విద్యాబాలన్‌

ఆ వీడియోలతో నాకు సంబంధం లేదు
X

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న తన వీడియోలను ఉద్దేశించి బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ తాజాగా స్పెషల్‌ మెసేజ్‌ రిలీజ్‌ చేశారు. ఆ వీడియోలతో తనకు ఏమాత్రం సంబంధం లేదని, అవన్నీ ఏఐ టెక్నాలజీతో క్రియేట్‌ చేసిన డీప్‌ ఫేక్‌ వీడియోలని చెప్పారు. నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. 'సోషల్‌ మీడియా, వాట్సప్‌ గ్రూపుల్లో ఈ మధ్యకాలంలో నాకు సంబంధించిన పలు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అవన్నీ ఏఐ జనరేటెడ్‌వి. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వీడియోలను సృష్టించడం లేదా వ్యాప్తి చేయడంలో నా ప్రమేయం లేదు. అందులోని కంటెంట్‌ను కూడా నేను అంగీకరించడం లేదు. కాబట్టి సోషల్‌ మీడియాలో వీడియోలు షేర్‌ చేసే ముందు దయచేసి వాటి గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి. ఏఐ జనరేటెడ్‌ కంటెంట్‌ మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉన్నది. అప్రమత్తంగా ఉండండి అని విద్యాబాలన్‌ పేర్కొన్నారు. సినిమాల విషయానికి వస్తే విద్యాబాలన్‌ కీలకపాత్ర పోషించిన 'భూల్‌ భూలయ్యా3' గత ఏడాదిలో రిలీజై విజయాన్ని అందుకున్నది. కార్తిక్‌ ఆర్యన్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమె మల్లిక పాత్రలో కనిపించి అభిమానులను అలరించారు.

First Published:  2 March 2025 12:51 PM IST
Next Story