Narappa: థియేటర్లలోకి వెంకటేష్ సినిమా
Venkatesh's Narappa: ఏ సినిమా అయినా థియేటర్లలో రిలీజైన తర్వాత ఓటీటీలోకి వస్తుంది. కానీ నారప్ప మాత్రం ఓటీటీలో రిలీజైన తర్వాత, ఇప్పుడు ఫ్రెష్ గా థియేటర్లలోకి వస్తోంది.
వెంకటేష్ బర్త్ డే కానుకగా డిసెంబర్13న 'నారప్ప' చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. వెంకటేష్ హీరోగా, సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కింది 'నారప్ప'. అయితే కరోనా పరిస్థితుల నేపధ్యంలో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు.
అయితే 'నారప్ప' ని బిగ్ స్క్రీన్ పై చూడాలని వెంకీ అభిమానులు ఆశపడ్డారు. పైగా ఇప్పుడు రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అందుకే నారప్పను తొలిసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.
"ప్రస్తుతం బర్త్ డే రోజుల్లో అభిమానులు, ప్రేక్షకుల కోసం సినిమాలు రీరిలీజ్ ని ఒక ఈవెంట్ లా చేసి విడుదల చేయడం మంచి పరిణామం. ఈ నేపధ్యంలో ఏ సినిమా వేద్దామని ఆలోచిస్తుంటే అభిమానులు నారప్పని థియేటర్ లో చూడాలని ఉందని కోరారు. దీంతో బర్త్ డే సందర్భంగా ఒక రోజు థియేటర్ లో వేస్తామని అమెజాన్ కి రిక్వస్ట్ చేశాం. దానికి వారు అంగీకరించారు. రెవెన్యూ గురించి ప్రస్తావన వచ్చినపుడు.. ఇందులో వచ్చే రెవెన్యూ మేము తీసుకోమని చెప్పాం. ఇందులో ఎంత రెవెన్యూ వచ్చినా ఆ మొత్తాన్ని ఛారిటీకే ఇచ్చేస్తాం."
ఇలా నారప్ప రిలీజ్ పై స్పందించారు సురేష్ బాబు. కేవలం ఒక్క రోజు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. అలా నారప్ప విషయంలో అభిమానుల కోరిక తీరింది.