Telugu Global
Cinema & Entertainment

Venkatesh | ఘనంగా వెంకటేష్ కూతురు వివాహం

Venkatesh's Daughter - తన రెండో కూతురికి పెళ్లి చేశాడు వెంకటేశ్. రాత్రి రామానాయుడు స్టుడియోస్ లో ఈ వివాహం గ్రాండ్ గా జరిగింది.

Venkatesh | ఘనంగా వెంకటేష్ కూతురు వివాహం
X

హీరో వెంకటేష్ తన రెండో కూతురుకు పెళ్లి చేశాడు. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడు నిషాంత్ తో, వెంకటేష్ రెండో కూతురు హయవాహిని వివాహం గ్రాండ్ గా జరిగింది. రామానాయుడు స్టుడియోస్ లో ప్రత్యేకంగా వేసిన పెళ్లి మంటపంలో నిన్నరాత్రి ఈ వివాహం జరిగింది.

ఈ పెళ్లికి టాలీవుడ్ నుంచి చిరంజీవి, మహేష్ బాబు, రానా, నాగచైతన్య.. ఇలా చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ మాత్రం హాజరుకాలేకపోయారు. వాళ్లు తమ సినిమాల షూటింగ్స్ కోసం విశాఖపట్నంలో బిజీగా ఉన్నారు.

ఇక పెళ్లికి ముందురోజు జరిగిన మెహందీ వేడుకల్లో నమ్రత, సితార ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ పెళ్లి మేటర్ బయటకొచ్చింది. అంతవరకు ఎవ్వరికీ వెంకీ కూతురు వివాహం గురించి తెలియదు.

2 నెలల కిందట నిశ్చితార్థం కూడా ఇలానే జరిగింది. సడెన్ గా చిరంజీవి, మహేష్ లాంటి ప్రముఖులు విజయవాడలో కనిపించేసరికి అంతా ఆశ్చర్యపోయారు. కట్ చేస్తే, బెజవాడులో హయవాహిని నిశ్చితార్థం అనే విషయం తెలిసొచ్చింది.

వెంకీకి నలుగురు సంతానం. పెద్దమ్మాయి అశ్రితకు ఇప్పటికే పెళ్లయింది. ఆమె విదేశాల్లో సెటిల్ అయింది. రెండో అమ్మాయి హయవాహినికి రాత్రి పెళ్లి జరిగింది. వీళ్లు కూడా విదేశాల్లో సెటిల్ అవ్వబోతున్నారు. ఇక మూడో అమ్మాయి భావన, నాలుగో సంతానంగా పుట్టిన కొడుకు అర్జున్ ప్రస్తుతం చదువుకుంటున్నారు.

First Published:  16 March 2024 1:06 PM IST
Next Story