Telugu Global
Cinema & Entertainment

Saindhav | నాపై ఎలాంటి ఒత్తిడి లేదంటున్న వెంకీ

Saindhav - వెంకీ నటించిన 75వ చిత్రం సైంధవ్. ఈ సినిమాకు సంబంధించి తను ఎలాంటి ఒత్తిడి ఫీల్ అవ్వడం లేదని ప్రకటించారు వెంకటేష్.

Saindhav | నాపై ఎలాంటి ఒత్తిడి లేదంటున్న వెంకీ
X

విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం మరికొన్ని గంటల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో విక్టరీ వెంకటేష్ విలేకర్ల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. సైంధవ్ తన 75వ చిత్రం అయినప్పటికీ ఎలాంటి ఒత్తిడి లేదని ప్రకటించారు.

"నాకు ఆ ఒత్తిడి ఏమీ లేదు. 75 అనేది నెంబర్ మాత్రమే. అయితే ఒక కెరీర్ లో 50, 75, 100 నెంబర్స్ సహజంగానే ఒక మైల్ స్టోన్ లా అనుకోవచ్బు. నా వరకూ .. ఆ సమయానికి వచ్చింది నిజాయితీగా చేయాలని ప్రయత్నిస్తాను. ప్రతి సినిమా ప్రత్యేకమే. ప్రతి సినిమాకి కష్టపడి పని చేయాలి. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి."

సైంధవ్ సినిమాలో చాలా మంచి డాటర్ సెంటిమెంట్ ఉందంటున్నారు వెంకటేష్. రెగ్యులర్ గా కాకుండా కథకు అవసరమైయ్యే ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయని, అవి కూడా చాలా నేచురల్ గా, ఫాస్ట్ పేజ్ లో ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

తన కెరీర్ లో సైంధవ్ సినిమా డిఫరెంట్ మూవీ అవుతుందని చెప్పిన వెంకీ, దర్శకుడు శైలేష్ కొలనుతో వర్క్ చేయడం చాలా మంచి అనుభూతిని ఇచ్చిందన్నారు. శ్రద్ధా ఆర్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

First Published:  12 Jan 2024 10:50 PM IST
Next Story