Telugu Global
Cinema & Entertainment

Venkatesh | రానా నాయుడు-3 కూడా

Venkatesh's Rana Naidu 3: ప్రస్తుతం రానా నాయుడు 2 చేస్తున్నాడు వెంకీ. ఇప్పుడీ సీనియర్ హీరో సీజన్-3 పై కూడా కన్నేశాడు.

Venkatesh | రానా నాయుడు-3 కూడా
X

విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది ప్రారంభంలో సైంధవ్‌తో డిజాస్టర్ ఇచ్చాడు. ఆ వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రానా నాయుడు-2 స్టార్ట్ చేశాడు. పూర్తిగా సీజన్-2 పైనే దృష్టి పెట్టాడు. ముంబయిలో విరామం లేకుండా చిత్రీకరణ జరుగుతోంది.

వెంకీ, రానా జూన్ చివరి నాటికి లేదా జూలై మధ్యలో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ సంస్థ, ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి సీజన్-3 కూడా ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి అనుమతులు రావడంతో పాటు, వెంకీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది.

సీజన్-3 స్క్రిప్ట్ దశలో ఉంది. రానా-వెంకీ ఇద్దరూ వచ్చే ఏడాది ప్రారంభంలో రానా నాయుడు 3 షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. వెంకటేష్ ఈ ఏడాది చివర్లో అనిల్ రావిపూడి చిత్రానికి షూట్ చేయనున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. ఇది రిలీజైన వెంటనే రానా నాయుడు 3 స్టార్ట్ చేస్తాడు వెంకీ.

దిల్ రాజు నిర్మాతగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. గేమ్ ఛేంజర్ పూర్తయిన వెంటనే ఈ మూవీ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు దిల్ రాజు.

First Published:  3 Jun 2024 5:07 PM
Next Story