Telugu Global
Cinema & Entertainment

Venkatesh | వెంకీ సినిమా మొదలైంది

Venkatesh - వెంకటేష్-అనీల్ రావిపూడి కాంబినేషన్ లో కొత్త సినిమా సెట్స్ పైకి వచ్చింది. రెగ్యులర్ షూట్ మొదలైంది.

Venkatesh | వెంకీ సినిమా మొదలైంది
X

వెంకటేష్, అనీల్ రావిపూడి సినిమా మొదలైంది. ఈమధ్య లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి హైదరాబాద్ లో ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ లో హీరోయిన్ మీనాక్షి చౌదరిపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. ఈమెతో పాటు సీనియర్ నరేష్ కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు.

ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని మరోసారి ప్రకటించారు. ఇంతకుముందు వెంకీ-రావిపూడి కాంబినేషన్ లో ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలొచ్చాయి. ఇది వీళ్ల కాంబోలో మూడో సినిమా. ఇక సంక్రాంతి సెంటిమెంట్ విషయానికొస్తే.. ఎఫ్-2, సరిలేరునీకెవ్వరు సినిమాలతో సంక్రాంతికి హిట్స్ కొట్టాడు అనీల్ రావిపూడి.

తాజా చిత్రం అతడికి మూడో సంక్రాంతి సినిమా అవుతుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మరో హీరోయిన్ గా చేస్తోంది. మీనాక్షి చౌదరి పోలీసాఫీసర్ గా నటిస్తుండగా, ఐశ్వర్య రాజేష్, వెంకీకి భార్యగా కనిపించనుంది. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  12 July 2024 3:18 AM GMT
Next Story