Telugu Global
Cinema & Entertainment

Veera Simha Reddy Movie Collections: వీరసింహారెడ్డి లేటెస్ట్ కలెక్షన్లు

Veera Simha Reddy Movie Collections : బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహ రెడ్డి మూవీ లేటెస్ట్ కలెక్షన్లు చూద్దాం.

Veera Simha Reddy Movie Review: ‘వీరసింహారెడ్డి’ – రివ్యూ {2.5/5}
X

Veera Simha Reddy Movie Review: ‘వీరసింహారెడ్డి’ – రివ్యూ {2.5/5}

రెండో రోజు పడిపోయిన వీరసింహారెడ్డి సినిమా, మూడో రోజుకు కాస్త కోలుకుంది. అయితే మొదటి రోజు అంత ఊపు మాత్రం కనిపించలేదు. మొదటి రోజు ఈ సినిమాకు 25 కోట్లకు పైగా షేర్ రాగా, రెండో రోజు ఆ షేర్ 5 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఇక మూడో రోజైన శనివారం, బాలకృష్ణ సినిమాకు 6 కోట్ల 45 లక్షల రూపాయల షేర్ వచ్చింది.


తాజా వసూళ్లతో బాలకృష్ణ సినిమాకు ఏ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయనేది క్లారిటీ వచ్చింది. ఈరోజు, రేపు వచ్చే కలెక్షన్లపైన ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 73 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే సినిమాకు ఇంకా 30 కోట్ల రూపాయలు కావాలి.


తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 రోజుల్లో 37 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఈ 3 రోజుల్లో వీరసింహారెడ్డి సినిమాకు వచ్చిన బ్రేకప్ చూద్దాం.


నైజాం - 9.84 కోట్లు

సీడెడ్ - 9.98 కోట్లు

ఉత్తరాంధ్ర - 3.67 కోట్లు

ఈస్ట్ - 2.73 కోట్లు

వెస్ట్ - 2.54 కోట్లు

గుంటూరు - 4.24 కోట్లు

నెల్లూరు - 1.62 కోట్లు

కృష్ణా - 2.43 కోట్లు

First Published:  15 Jan 2023 3:16 PM IST
Next Story