Telugu Global
Cinema & Entertainment

Operation Valentine | వరుణ్ తేజ్ కొత్త సినిమా టైటిల్ ఇదే

Operation Valentine - వరుణ్ తేజ్ కొత్త సినిమాకు పేరు పెట్టారు. ఈ సినిమా పేరు ఆపరేషన్ వాలంటైన్.

Operation Valentine | వరుణ్ తేజ్ కొత్త సినిమా టైటిల్ ఇదే
X

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఎయిర్ ఫోర్స్ బేస్డ్ యాక్షన్ మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాల్ని చూపే ఈ సినిమాకు 'ఆపరేషన్ వాలెంటైన్' అనే ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాకు రిలీజ్ డేట్ కూడా ఖరారు చేశారు. డిసెంబర్ 8న థియేటర్లలోకి వస్తోంది ఆపరేషన్ వాలంటైన్.

ఈ యాక్షన్ మూవీలో, బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు వరుణ్ తేజ్. అతడికి ఇదే తొలి బాలీవుడ్ ప్రాజెక్టు. హిందీతో పాటు, తెలుగులో సైమల్టేనియస్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌ గా కనిపించనున్నాడు హీరో. అతడి సరసన రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లర్ కనిపించనుంది.

2022 విడుదలైన ‘మేజర్’ భారీ విజయం తర్వాత, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరోసారి ఈ దేశభక్తి కథతో వస్తోంది. దేశభక్తి తో పాటు.. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్ అందిస్తుందట ఈ సినిమా.

యాడ్ ఫిలిం మేకర్ శక్తిప్రతాప్ సింగ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఈ సినిమా కథ కూడా ఇతడిదే. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

First Published:  15 Aug 2023 3:29 AM GMT
Next Story