Telugu Global
Cinema & Entertainment

Matka movie | మట్కా మూవీ షూటింగ్ అప్ డేట్స్

Matka movie - వరుణ్ తేజ్ తాజా చిత్రం మట్కా. ఈ మూవీ షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం.

Matka movie | మట్కా మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

వరుణ్ తేజ్ తాజా చిత్రం మట్కా. కరుణ కుమార్ దర్శకత్వంలో వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం, వరుణ్ తేజ్‌ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా.

తాజాగా ఈ సినిమా కీలకమైన షెడ్యూల్ పూర్తయింది. రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా కోసం పాతకాలం నాటి వైజాగ్ సెట్ వేశారు. ఈ సెట్ లోనే సుదీర్ఘమైన షెడ్యూల్‌ను ముగించింది యూనిట్. కొన్ని కీలకమైన సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు తీయడంతో పాటు నోరా ఫతేహీపై ఓ రెట్రో సాంగ్ షూట్ కూడా పూర్తిచేశారు.

మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో నోరా ఫతేహీ రెట్రో అవతార్‌లో, కలర్‌ఫుల్ పబ్ సెట్‌లో సొగసుగా కనిపించింది. నోరా అద్భుతమైన డాన్సర్ అనే విషయం అందరికీ తెలిసిందే. మట్కాలోని ఈ రెట్రో సాంగ్ ఆమె డాన్సింగ్ టాలెంట్ ను మరోసారి చూపించబోతోంది. జానీ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రాఫర్.

1958 నుండి 1982 వరకు 24 సంవత్సరాల పాటు సాగే కథతో వస్తోంది మట్కా. ఇందులో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన మేకోవర్‌లు చూపించబోతున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  18 July 2024 5:00 PM GMT
Next Story