Telugu Global
Cinema & Entertainment

Matka movie | వరుణ్ తేజ్ భారీ యాక్షన్

Varun Tej's Matka movie - వరుణ్ తేజ్ కొత్త సినిమా మట్కా. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం.

Matka movie | వరుణ్ తేజ్ భారీ యాక్షన్
X

వరుణ్ తేజ్ హీరోగా, కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మట్కా. వైర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. సినిమా కోసం నిర్మించిన భారీ సెట్ లో ప్రస్తుతం ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. సినిమాలో చాలా కీలకంగా ఉండే ఈ ఫైట్ సీక్వెన్స్ ను విజయ్ మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు.

ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం వరుణ్ తేజ్ చాలా రిస్కీ స్టంట్స్ చేస్తున్నాడట. సినిమాకు ఈ యాక్షన్ ఎపిసోడ్ హైలెట్ అంటున్నారు. 'మట్కా'లో మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు వరుణ్.

దేశాన్ని కదిలించిన యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు కరుణ కుమార్ ఈ స్క్రిప్ట్‌ రాసుకున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది. "మట్కా"కి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నాడు.

First Published:  9 July 2024 7:10 AM GMT
Next Story