Telugu Global
Cinema & Entertainment

Varun Tej | మట్కా మొదలుపెట్టిన వరుణ్ తేజ్

Varun Tej's Matka - మట్కా మూవీ స్టార్ట్ చేశాడు వరుణ్ తేజ్. ఇందులో 4 గెటప్స్ లో కనిపించబోతున్నాడు.

Varun Tej | మట్కా మొదలుపెట్టిన వరుణ్ తేజ్
X

హీరో వరుణ్ తేజ్ తన అప్ కమింగ్ పాన్-ఇండియన్ మూవీ "మట్కా"తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ విజయేందర్ రెడ్డి, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ రజనీ తాళ్లూరితో కలిసి నిర్మిస్తున్నారు.

ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ భారీగా తెరకెక్కుతోంది. హ్యుజ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అద్భుతమైన నటీనటులు, టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. "మట్కా" తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. భారీ సెట్‌లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

40 రోజుల ఈ భారీ షెడ్యూల్ కోసం ఆర్ఎఫ్సీలో సెట్ వేశారు. ఇందులోనే యూనిట్ చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి ఈ షెడ్యూల్‌లో పార్ట్ అయ్యారు.

ఇందులో 4 డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడు వరుణ్ తేజ్. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు.

First Published:  20 Jun 2024 5:30 PM GMT
Next Story