Telugu Global
Cinema & Entertainment

Matka Movie | మట్కా మూవీ షూటింగ్ అప్ డేట్స్

Matka Movie - వరుణ్ తేజ్ తాజా చిత్రం మట్కా. త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

Matka Movie | మట్కా మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పాన్-ఇండియన్ మూవీ మట్కా. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈమెతో కలిసి వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

జూన్ 19 నుంచి మట్కా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్‌ నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ ఈ సినిమాలో 4 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. యావత్ దేశాన్ని కదిలించిన ఒక యదార్థ ఘటన ఆధారంగా ఈ పీరియాడిక్ మూవీని తెరకెక్కిస్తున్నారు.

వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ కు మంచి స్పందన వచ్చింది. నవీన్ చంద్ర, పి రవి శంకర్ వంటి టాలెంట్ ఆర్టిస్టులు నటిస్తున్న ఈ సినిమాకు కిషోర్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా, జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

First Published:  8 Jun 2024 5:26 PM GMT
Next Story