Matka Movie | బ్రాకెట్ ఓపెన్ చేసిన మట్కా
Matka Movie - మట్కా అంటే అర్థమేంటి? వరుణ్ తేజ్ లుక్ ఏంటి? అసలు ఈ సినిమా జానర్ ఏంటి? గ్లింప్స్ ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలిచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్.
వరుణ్ తేజ్, కరుణ కుమార్ కాంబోలో వస్తోంది ‘మట్కా’. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంటోంది.
తాజాగా మట్కా ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఈ గ్లింప్స్ కు ఓపెనింగ్ బ్రాకెట్ అని పేరు పెట్టారు. హీరో గ్రామఫోన్‌లో మ్యూజిక్ ని ప్లే చేయడంతో ఇది ఓపెన్ అవుతుంది. ఇది రెండు వేర్వేరు టైమ్‌లైన్‌లలో పాత్రలని ప్రజెంట్ చేస్తోంది. నవీన్ చంద్ర గ్యాంగ్‌స్టర్‌గా కనిపించగా, రవిశంకర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. హీరో బాల్యాన్ని చూపించారు. అక్కడ్నుంచి అతడు గ్యాంబ్లింగ్ మాఫియాకు అధిపతిగా ఎదుగుతాడు. సిగార్ తాగుతూ ఎవరికో ఫోన్‌లో ‘ప్రామిస్’ చేస్తాడు.
క్లిప్‌లో వరుణ్ తేజ్‌ని పూర్తిగా చూపించనప్పటికీ, చాలా మేకోవర్ అయినట్టు అర్థమైంది. అతని డ్రెస్సింగ్ 80ల నాటి ఫ్యాషన్స్ ను పోలి ఉంది. 1958, 1982 మధ్య జరిగే కథ కాబట్టి, 50ల నుండి 80ల వరకు ఉన్న వాతావరణాన్ని రీక్రియేట్ చేయడంలో దర్శకుడు కరుణ కుమార్ విజయం సాధించాడు.
జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ ఘటన ఆధారంగా మట్కా తెరకెక్కుతోంది. సినిమాలో వరుణ్ సరసన నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.