Gandeevadhari Arjuna - వరుణ్ తేజ్ సినిమా అప్ డేట్స్
Varun Tej's Gandeevadhari Arjuna - వరుణ్ తేజ్ కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం అమెరికా షెడ్యూల్ నడుస్తోంది.

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ యాక్షన్ మోడ్‌లోకి దిగేశాడు. ఆయన నటిస్తున్న ‘గాంఢీవధారి అర్జున’ సినిమా నయా షెడ్యూల్ అమెరికాలో జరుగుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇటీవల మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ కి, టైటిల్‌కి మంచి స్పందన వస్తోంది.
అక్టోబర్ నుంచి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ‘గాండీవధారి అర్జున’. ఇటీవల యూరోప్ దేశాల్లో భారీ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. యాక్షన్ సీక్వెన్స్ కోసం ఫారిన్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.
అమెరికా షెడ్యూల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ని తెరకెక్కిస్తున్నారు. బీవీయస్‌యన్ ప్రసాద్, బాపినీడు. ఎస్వీసీసీ పతాకంపై తెరకెక్కుతోంది ఈ సినిమా. వరుణ్‌తేజ్ ఈ చిత్రంలో సెక్యూరిటీ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి ప్రజలను అతడు ఎలా కాపాడాడు, అతని ప్లాన్ ఏంటనేది స్టోరీ.
వరుణ్‌తేజ్ కెరీర్‌లో భారీ బడ్జెట్ సినిమా ఇదే. మిక్కీ.జె.మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.