Varun Tej | సొంత ఖర్చుతో పెళ్లి చేసుకోబోతున్న వరుణ్ తేజ్
Varun Tej - నవంబర్ 1న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్లి ఖర్చు మొత్తం వరుణ్ తేజ్ దే.

Varun Tej, Lavanya Tripathi Engagement: రేపే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం
మెగా హీరో వరుణ్ తేజ్ తన సొంత ఖర్చుతో, తన పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ విషయంలో తన తండ్రి నాగబాబు లేదా పెదనాన్న చిరంజీవికి అవకాశం ఇవ్వట్లేదు. తన ఖర్చుతో, తన మనసుకు నచ్చిన విధంగా లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు.
ఇటలీలోని టస్కానీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు. నవంబర్ 1న వీళ్ల పెళ్లి ఘనంగా జరగనుంది. టస్కానీలోని ఓ ఖరీదైన రిసార్ట్ లో ఈ మేరకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ పెళ్లి కోసం మెగా కాంపౌండ్ సభ్యులందర్నీ తన సొంత ఖర్చుతో ఇటలీకి తీసుకెళ్తున్నాడు వరుణ్ తేజ్.
అంతా ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లన్నీ తన దగ్గరుండి చూసుకుంటున్నాడు. దీనికి సంబంధించి వరుణ్ తేజ్ టీమ్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బార్గో శాన్ ఫెలిస్ అనే రిసార్ట్ లో వరుణ్ తేజ్ పెళ్లి జరుగుతుంది. ఈ రిసార్ట్ లో ఒకేసారి వెయ్యి మందికి పైగా బస చేయొచ్చు. ఇందులో దాదాపు 30 రూమ్స్ ను వరుణ్ తేజ్ తన పెళ్లి కోసం బుక్ చేసినట్టు తెలుస్తోంది.
లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఇటలీలోనే క్లోజ్ అయ్యారు. మిస్టర్ సినిమా షూటింగ్ టైమ్ లో వీళ్ల అనుబంధం పెనవేసుకుంది. అప్పట్నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లితో ఒకటి కాబోతున్నారు. తమ ప్రేమకు వేదికగా నిలిచిన ఇటలీలోనే పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.