Telugu Global
Cinema & Entertainment

Varun Tej | లవ్ మేటర్ మొత్తం బయటపెట్టిన వరుణ్ తేజ్

Varun Tej - తన ప్రేమ సంగతులు బయటపెట్టాడు వరుణ్ తేజ్. లావణ్య త్రిపాఠితో తనది ఆరేళ్ల పరిచయం అంటున్నాడు.

Varun Tej, Lavanya Tripathi Engagement: రేపే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం
X

Varun Tej, Lavanya Tripathi Engagement: రేపే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం

త్వరలోనే లావణ్య త్రిపాఠిని పెళ్లాడనున్నాడు వరుణ్ తేజ్. మరి వీళ్ల ప్రేమ ఎప్పుడు మొదలైంది? ఎవరు ముందుగా ప్రపోజ్ చేశారు.. ఇలాంటి విషయాలన్నింటినీ వరుసపెట్టి బయటపెట్టాడు ఈ హీరో. లావణ్య త్రిపాఠి గురించి అతడేమంటున్నాడో అతడి మాటల్లోనే...

- లావణ్య, నేను చాలా ఏళ్లుగా ఫ్రెండ్స్. మా ఇద్దరికి కామన్ అభిరుచులున్నాయి. ఒకరికొకరం బాగా అర్థమయ్యాం. ఆ తర్వాత మా బంధాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఏడాది కిందటే జరిగిన పరిచయమైతే మా ఇద్దరి బంధం గురించి ఇంకా బాగా చెప్పేవాడ్ని. కానీ చాలా ఏళ్లయింది. 5-6 ఏళ్లు గడిచిపోయాయి. ఒకటి మాత్రం చెప్పగలను. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నా జీవిత భాగస్వామి కూడా బెస్ట్ ఫ్రెండ్ అయింది.

- ప్రేమ వ్యవహారంలో మా ఇంట్లో వాళ్లు ఎప్పుడూ ఓపెన్ గా ఉంటారు. నా నిర్ణయాన్ని వాళ్లు నమ్ముతారు. లావణ్య ఇంట్లో కూడా తనను బాగా నమ్ముతారు. చాలా చిన్న వయసులోనే తను ఇంట్లోంచి బయటకొచ్చి వృత్తి రీత్యా ముంబయి, హైదరాబాద్ లో ఉండేది. లావణ్య తీసుకునే నిర్ణయాల్ని ఆమె తల్లిదండ్రులు ఎప్పుడూ గౌరవిస్తారు. మా ప్రేమకు ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి ఇబ్బందులు కలగలేదు.

- మాక్కూడా బయటకెళ్లాలని, డిన్నర్స్ చేయాలని అనిపించేది. కానీ చాలా త్యాగం చేశాం. ఎందుకంటే, మా రిలేషన్ షిప్ పై చర్చ మొదలైనప్పుడు, అది మా బంధంలో ఎక్కడైనా ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందేమో అని భయం. అందుకే సీక్రెట్ గా ఉంచాం.

- ఈ ఐదారేళ్లలో చాలా బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నాం. కానీ ప్రత్యేకమైన బహుమతులంటూ ఏమీ లేదు. ప్రస్తుతం నేను వాడుతున్న ఫోన్ తను ఇచ్చిందే. నేను కూడా చాలా బహుమతులిచ్చాను.

- సర్ ప్రైజ్ లు ఇవ్వడం నాకిష్టం లేదు. లవ్ ప్రపోజ్ చేస్తాననే విషయాన్ని కూడా చెప్పి చేశాను. ఇక బహుమతులు కొనాల్సి వస్తే, ఏం కావాలో అడిగి, అదే కొంటాను.

- లావణ్య చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది. ఉన్నతంగా ఆలోచిస్తుంది. ఎమోషన్స్ విషయంలో చాలా బ్యాలెన్స్ గా ఉంటుంది. నచ్చిన వస్తువులు, వ్యక్తుల పట్ల చాలా కేరింగ్ గా ఉంటుంది. లావణ్యలో నాకు నచ్చిన క్వాలిటీస్ ఇవే.

- ఎంగేజ్ మెంట్ సింపుల్ గా చేసుకున్నాం. పెళ్లి కూడా అంతే సింపుల్ గా జరుగుతుంది. ఈ ఏడాదిలోనే పెళ్లి. త్వరలోనే చెబుతా.

First Published:  17 Aug 2023 10:45 PM IST
Next Story