Varun Tej, Lavanya Tripathi Engagement: రేపే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం
Varun Tej, Lavanya Tripathi Engagement: హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ప్రేమ వ్యవహారం అధికారికమైంది. వీళ్లిద్దరూ రేపు నిశ్చితార్థం చేసుకోబోతున్నారు.

Varun Tej, Lavanya Tripathi Engagement: రేపే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం
హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమధ్య లావణ్యకు ప్రపోజ్ చేసేందుకు వరుణ్ తేజ్ ఖరీదైన డైమండ్ రింగ్ కొన్నాడని, తన ప్రేమను వ్యక్తం చేసేందుకు గోవా వెళ్తున్నాడంటూ కథనాలు వచ్చాయి. అయితే ఇలా ఎన్ని కథనాలు వచ్చినా ఎప్పటికప్పుడు ఈ జంట వాటిని ఖండిస్తూ వచ్చింది.
ఎట్టకేలకు వీళ్ల ఎఫైర్ నిజమని తెలింది. మెగా కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. రేపు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం గ్రాండ్ గా జరగనుంది. ఈరోజు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక, లావణ్య త్రిపాఠి మంచి ఫ్రెండ్స్. అలా వరుణ్ తేజ్ కు పరిచయమైంది లావణ్య. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అంతరిక్షం, మిస్టర్ లాంటి సినిమాలు కూడా చేశారు. అదే టైమ్ లో వీళ్ల స్నేహం, ప్రేమగా మారినట్టు తెలుస్తోంది.
మొత్తానికి మెగా కాంపౌండ్ లో పెళ్లి బాజా మోగబోతోంది. ఇన్నాళ్లు ఊహాగానాలకు మాత్రమే పరిమితమైన వీళ్ల ప్రేమ వ్యవహారం అధికారికమైంది. ఈ ఏడాదిలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.