Telugu Global
Cinema & Entertainment

Varun Tej marriage | ఓ ఇంటివాడైన వరుణ్ తేజ్

Varun Tej and Lavanya Tripathi Wedding | ఆరేళ్లు ప్రేమించుకున్నారు, ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇకపై లవర్స్ కాదు. వీళ్లిద్దరూ భార్యాభర్తలు.

Varun Tej marriage | ఓ ఇంటివాడైన వరుణ్ తేజ్
X

Varun Tej marriage | ఓ ఇంటివాడైన వరుణ్ తేజ్

Varun Tej marriage | వరుణ్ తేజ్ ఓ ఇంటివాడయ్యాడు. తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇటలీలో వీళ్ల పెళ్లి వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో పూర్తి హిందు సంప్రదాయంలో ఈ పెళ్లి జరిగింది.

డెస్టినేషన్ వెడ్డింగ్ లో భాగంగా ఇటలీని ఎంచుకుంది ఈ జంట. మొన్నట్నుంచే పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ముందుగా కాక్ టైల్ పార్టీతో పెళ్లి సంబరం మొదలైంది. ఆ తర్వాత హల్దీ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వెంటనే మెహందీ ఫంక్షన్ నిర్వహించారు.

ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత సంగీత్ కూడా ఏర్పాటుచేశారు. ఇక పెళ్లి రోజు వరుణ్ తేజ్ ట్రెడిషనల్ గా ముస్తాబవ్వగా, అతడ్ని ఓపెన్ టాప్ కారులో పెళ్లి మంటపం వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడ పెళ్లికూతురు లావణ్య త్రిపాఠి సిద్ధంగా ఉంది. ఆ తర్వాత వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య లావణ్య మెడలో మూడు ముళ్లు వేశాడు వరుణ్ తేజ్.

ఈ ఆదివారం సినీ, రాజకీయ ప్రముఖులకు ఈ జంట గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటుచేసింది. ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు అందాయి. హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఈ రిసెప్షన్ నిర్వహించనున్నారు. రేపు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠితో పాటు అంతా ఇండియాకు తిరిగొస్తారు.

First Published:  1 Nov 2023 10:49 PM IST
Next Story