Telugu Global
Cinema & Entertainment

Viraji | హిట్ కొట్టిన వరుణ్ సందేశ్

Viraji Movie - థియేటర్లలో హిట్ కొట్టలేకపోయిన వరుణ్ సందేశ్, ఓటీటీలో మాత్రం సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా పేరు విరాజీ.

Viraji | హిట్ కొట్టిన వరుణ్ సందేశ్
X

వరుణ్ సందేశ్ హీరోగా నటించిన సినిమా విరాజీ. థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ సినిమా ఓటీటీలో సూపర్ హిట్టయింది. ఆహా యాప్ లో దాదాపు 56 లక్షల నిమిషాలు ఈ సినిమాను చూశారు నెటిజన్లు.

ఈ చిత్రాన్ని మహా మూవీస్ తో కలిసి ఎం3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించగా ఆద్యంత హర్ష దర్శకుడిగా ప్రతిభ చాటుకున్నారు. ఈ నెల 2న థియేటర్స్ లోకి వచ్చిన “విరాజి” సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ... విరాజి సినిమాను ఈ నెల 2న థియేట్రికల్ రిలీజ్ చేశాం. ఆ వారం చాలా సినిమాలు ఉండటం వల్ల ఎక్కువమంది ఆడియెన్స్ కు మా మూవీ రీచ్ కాలేకపోయింది. అందుకే వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకురావాలని అనుకున్నాం. ఆహాలో మా సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే మా విరాజి చిత్రం 56 లక్షల వాచ్ మినిట్స్ తో ఆహా యాప్ లో ట్రెండింగ్ లో ఉంది.

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ... విరాజి సినిమా ఆహా ఓటీటీలోకి వచ్చింది. 56 లక్షల వాచ్ మినిట్స్ తో ట్రెండింగ్ లో ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి పాయింట్ తో డైరెక్టర్ ఆద్యంత్ హర్ష విరాజి సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించారు. అయితే ఆగస్టు 2న థియేటర్స్ అందుబాటులో లేక చాలామంది చూడలేకపోయారు. ఇప్పుడు ఆహా ద్వారా అందరు చూస్తున్నారు, అని అన్నాడు.

ఈ సినిమాలో రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, ప్రసాద్ బెహరా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏబినేజర్ పాల్ సంగీతం అందించాడు.

First Published:  25 Aug 2024 5:21 PM GMT
Next Story