Varalaxmi Sarathkumar | శబరి సినిమాకు విడుదల తేదీ ఫిక్స్
Varalaxmi Sarathkumar - విలక్షణ పాత్రలు పోషించే వరలక్ష్మి, ఇప్పుడు శబరి అనే సినిమా చేశారు. ఆ మూవీకి విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'శబరి'. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రూపొందింది. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.
చిత్ర నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ ''సరికొత్త కథాంశంతో తీసిన సినిమా 'శబరి'. కథ, కథనాలు ఇన్నోవేటివ్ గా ఉంటాయి. స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రమిది. వరలక్ష్మీ శరత్ ఇప్పటివరకు నటించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందీ సినిమా. ముఖ్యంగా ఆమె నటన 'వావ్' అనేలా ఉంటుంది." అన్నారు.
ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్స్ ఫస్ట్ కాపీ రెడీ అయింది. అవుట్ పుట్ బాగా వచ్చిందంటున్నారు నిర్మాత. మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఇటీవల 'వరల్డ్ ఆఫ్ శబరి' పేరుతో విడుదల చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 3న పాన్ ఇండియా లెవెల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీత దర్శకుడు.