Varalaxmi Sarathkumar | ఈ ఏడాదే నా పెళ్లి
Varalaxmi Sarathkumar - ఇప్పటికే నిశ్చితార్థం పూర్తయింది. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది వరలక్ష్మి.

వరలక్ష్మి శరత్ కుమార్
రీసెంట్ గా వరలక్ష్మి శరత్ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబయికి చెందిన వ్యాపారవేత్త నికోలయ్ సచ్ దేవ్ తో వరలక్ష్మి ఎంగేజ్ మెంట్ పూర్తయింది. ఓ పార్టీలో కలుసుకున్న వీళ్లిద్దరూ కొద్దికాలంలోనే దగ్గరయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల్ని ఒప్పించి, పెళ్లికి రెడీ అయ్యారు.
రీసెంట్ గా తన పెళ్లిపై స్పందించింది వరలక్ష్మి. ఇంకా తేదీ నిర్ణయించనప్పటికీ, ఈ ఏడాదిలోనే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. ఈ మేరకు తన అప్ కమింగ్ మూవీస్ కు సంబంధించి కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసినట్టు ఆమె తెలిపింది.
ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని క్లారిటీ ఇచ్చింది వరలక్ష్మి. ఈ అంశంపై తనకు, నికోలాయ్ కు మధ్య ఎప్పుడో డిస్కషన్ పూర్తయిందని వెల్లడించింది. ప్రస్తుతం తను చెన్నై నుంచి హైదరాబాద్ కు ప్రయాణం చేస్తున్నానని, పెళ్లి తర్వాత ముంబయి నుంచి హైదరాబాద్ కు జర్నీ చేయాల్సి ఉంటుందని సరదాగా వ్యాఖ్యానించింది.
తాజా సమాచారం ప్రకారం, పెళ్లి తర్వాత వరలక్ష్మి-నికొలాయ్ కలిసి హైదరాబాద్ లో ఓ ఇల్లు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఎక్కువగా టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో, తనే హైదరాబాద్ కు తాత్కాలికంగా మకాం మార్చే యోచనలో ఉన్నాడట నికోలాయ్.