Varalaxmi Sarathkumar | డబ్బు చూసి ప్రేమించలేదంటున్న హీరోయిన్
Varalaxmi Sarathkumar - కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటున్నాననే పుకార్లను తిప్పికొట్టింది వరలక్ష్మి శరత్ కుమార్.

తన పెళ్లి విషయంలో వస్తున్న ట్రోలింగ్స్ పై హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించింది. తనపై జరుగుతున్న అసత్య ప్రచారం తన వరకు వచ్చిందని వెల్లడించింది.
ముంబయికి చెందిన నికొలాయ్, వరలక్ష్మి కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాదిలోనే పెళ్లి ఉంటుంది. నికొలాయ్ డబ్బున్నోడు కాబట్టే వరలక్ష్మి అతడ్ని పెళ్లి చేసుకుంటోందంటూ చాలామంది పోస్టులు పెడుతున్నారు. వీటిపై ఘాటుగా స్పందించింది వరు.
"నేను నికొలాయ్ సచ్ దేవ్ ను డబ్బు కోసం పెళ్లి చేసుకోవడం లేదు. నా సంపాదనతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాంటప్పుడు నేను డబ్బు కోసం ఎందుకు పెళ్లి చేసుకుంటాను. నికొలాయ్ తన మొదటి భార్యతో కలిసి ఉన్నప్పట్నుంచే అతడితో నాకు పరిచయం. ఆయన ప్రవర్తన, మర్యాద చూసి నాకు ప్రేమ కలిగింది. నా కళ్లకు ఆయన ఎప్పుడూ హీరోనే."
ఈ క్రమంలో నికొలాయ్ కు ఆల్రెడీ పెళ్లయిందని, మొదటి భార్యకు విడాకులిచ్చాడనే విషయాన్ని వరలక్ష్మి పరోక్షంగా వెల్లడించినట్టయింది. ముంబయికి చెందిన బడా బిజినెస్ మేన్ నికొలాయ్ సచ్ దేవ్. కొన్ని కుటుంబ వ్యాపారాలతో పాటు, ఆర్ట్ గ్యాలరీ కూడా నడిపిస్తుంటాడు.