Varalaxmi SarathKumar | పోలీస్ గెటప్ పై వరలక్ష్మి కామెంట్స్
Varalaxmi SarathKumar - పోలీస్ పాత్రలు తనకు కొత్త కాదంటోంది వరలక్ష్మి. అయితే కోటబొమ్మాళి సినిమాలో మాత్రం పోలీస్ పాత్ర ఛాలెంజింగ్ అంటోంది. ఎందుకు..?
ఒకప్పుడు లేడీ పోలీస్ అంటే విజయశాంతి. మరి ఇప్పుడు ఎవరు? దీనికి సరైన సమాధానం వరలక్ష్మి శరత్ కుమార్. హీరోయిన్లలో ఈమె చేసినన్ని పోలీస్ పాత్రలు వేరే ఎవ్వరూ చేయలేదు. ఈసారి కూడా ఖాకీ డ్రెస్ వేసింది. కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టింది. ఇంతకీ ఏమంటోంది..
"నా కెరీర్‌లో ఎక్కువ పోలీస్ క్యారెక్టర్సే వస్తున్నాయి. తమిళంలో చాలా చేశాను కానీ.. తెలుగు ఆడియెన్స్‌కు మాత్రం ఫస్ట్ టైమ్ పోలీస్ గెటప్‌లో కనిపిస్తున్నా. ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తుంది. వాటిలో పోలీస్ ఆఫీసర్‌గానే కనిపించాలి. అయితే ప్రతి స్ర్కిప్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది కూడా డిఫరెంట్‌గానే ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా కనిపించాలని చాలా ట్రై చేస్తున్నా."
ఇలా పోలీస్ పాత్రలపై స్పందించింది వరలక్ష్మి శరత్ కుమార్. నయాట్టు సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన కోటబొమ్మాళిలో ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉంటుందని, తెలుగు వెర్షన్ కు చాలా మార్పులు జరిగాయని చెబుతోంది.
"నేను కథే హీరోగా భావిస్తా. ఇందులో శ్రీకాంత్ గారు ఒక పోలీస్ ఆఫీసర్, నేనొక పోలీస్ ఆఫీసర్. ఇద్దరిలో ఒకరు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది.. పోలీసులపై పొలిటికల్ ప్రెజర్ ఏ విధంగా ఉంటుందనేది ఈ మూవీ కాన్సెప్ట్."
ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ స్మోకింగ్ చేసింది. అది తనకు చాలా ఛాలెంజింగ్ అనిపించిందని చెప్పుకొచ్చింది. మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి వస్తోంది కోటబొమ్మాళి పీఎస్.