Sabari Movie: శబరి మూవీ షూటింగ్ అప్ డేట్స్
Sabari Movie: వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ పోషిస్తున్న సినిమా శబరి. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'శబరి'. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాథ్ నిర్మిస్తున్నాడు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.
ఇదొక స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్. కొత్త కథను తీసుకుని కమర్షియల్ హంగులతో తెరకెక్కించారు. ఈ చిత్రం ఒక రకంగా థ్రిల్లర్ జానర్ మూవీ అయినప్పటికీ... సినిమాలో అన్ని భావోద్వేగాలు ఉంటాయని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు సినిమాలో ఉన్నాయని అంటున్నారు మేకర్స్.
సినిమాలో స్వతంత్ర భావాలున్న ఆధునిక యువతిగా, శబరి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుంది. ఆమెపై కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. మరో 2-3 రోజుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ డబ్బింగ్ స్టార్ట్ చేయబోతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రచారాన్ని అధికారికంగా మొదలుపెడతారు. ఆ వెంటనే విడుదల తేదీని ప్రకటిస్తారు.