పవన్ ను ఇమిటేట్ చేసే స్థాయి నాకు లేదు
రంగరంగ వైభవంగా సినిమాలో ఓ సీన్ లో పవన్ కల్యాణ్ ను ఇమిటేట్ చేశాడు వైష్ణవ్ తేజ్. ఆ సన్నివేశంపై స్పందించిన ఈ హీరో, ఏమంటున్నాడో చూడండి..
రంగరంగ వైభవంగా సినిమా ట్రయిలర్ లో వైష్ణవ్ తేజ్, పవన్ కల్యాణ్ ను అనుకరించాడు. ఓ సన్నివేశంలో సిగ్గుపడుతూ కనిపించిన వైష్ణవ్.. అచ్చం పవన్ లా అనిపించాడు. దీనిపై తాజాగా స్పందించాడు వైష్ణవ్ తేజ్. పవన్ ను అనుకరించేంత స్థాయి తనకు లేదన్నాడు.
"టీజర్ లో నేను పవన్ మావయ్య ని ఇమిటేట్ చేశానని, అది చాలా బాగుందని అందరూ చెప్తున్నారు. నిజానికి మేము అది అనుకోని చేయలేదు. సుబ్బరాజు తో ఉండే ఓ సన్నివేశంలో నేను సిగ్గు పడాలి. అనుకోకుండా అలా వచ్చేసింది. ఆ సీన్ చేసిన తర్వాత నేను వెళ్లి మానిటర్ కూడా చూడలేదు. తర్వాత మా డైరెక్టర్ చెప్పాడు అది పవన్ కళ్యాణ్ ని గుర్తుచేసేలా ఉందని. సో, అది అలా వచ్చేసిందంతే, ఆయన్ని ఇమిటేట్ చేసే స్థాయి నాకు లేదు."
గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన రంగరంగ వైభవంగా సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటున్నాడు వైష్ణవ్. ఇదొక థియేట్రికల్ మూవీ అని చెబుతున్నాడు.
"ఈ సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. మంచి లవ్ ట్రాక్, ఎంటర్టైన్ మెంట్ , బ్యూటిఫుల్ సాంగ్స్, ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్ అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా మా ఇద్దరి ఇగో తో ఆడియన్ కి మంచి ఫన్ అందుతుంది. సినిమా అంతా సరదాగా ఉంటుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే సినిమా ఇది."
ఈరోజు థియేటర్లలోకి వచ్చింది రంగరంగ వైభవంగా సినిమా. కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.