Ustaad Bhagat Singh | హైదరాబాద్ లోనే పవన్ షూటింగ్
Ustaad Bhagat Singh - వారాహి యాత్ర తర్వాత పవన్ ఏ సినిమాకు కాల్షీట్లు ఇస్తాడో తేలిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టార్ట్ చేస్తాడు పవన్.
![Ustaad Bhagat Singh | హైదరాబాద్ లోనే పవన్ షూటింగ్ Ustaad Bhagat Singh | హైదరాబాద్ లోనే పవన్ షూటింగ్](https://www.teluguglobal.com/h-upload/2023/07/04/791125-ustaad-bhagat-singh-1.webp)
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీలో ఉన్నారు. రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. దీంతో అతడు చేస్తున్న సినిమాల షూటింగ్స్ ను ఆంధ్రప్రదేశ్ లోనే పెట్టుకుంటామని నిర్మాతలంతా సంయుక్తంగా ప్రకటన కూడా విడుదల చేశారు. కానీ అలాంటి ఏర్పాట్లు జరుగుతున్నట్టు కనిపించడం లేదు. పవన్ మరోసారి హైదరాబాద్ వెళ్లబోతున్నారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత. మూవీకి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అవుతుంది.
ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, అతని టీం నెక్స్ట్ షెడ్యూల్ కోసం భారీ సెట్‌ను నిర్మించారు. అక్కడ పవన్ కళ్యాణ్, ఇతర తారాగణంపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రెండో షెడ్యూల్ ప్రారంభానికి ముందు మేకర్స్ కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ని విడుదల చేశారు.
ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, అశుతోష్ రానా, నవాబ్ షా, కెజిఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు.
జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, పుష్ప, రంగస్థలం వంటి హిట్ చిత్రాలకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్, ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు.
ఇప్పటికే బ్రో సినిమాను పూర్తిచేశాడు పవన్ కల్యాణ్. ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్, హరిహర వీరమల్లు సినిమాలు పూర్తిచేసే పనిలో పడ్డాడు. వీటిలో ఓజీ, ఉస్తాద్ సినిమాలకు కాల్షీట్లు కేటాయిస్తున్నాడు.