Telugu Global
Cinema & Entertainment

పబ్లిసిటీకి ఇక షార్ట్ వీడియోల వినియోగం!

వినోద రంగంలో కంటెంట్ స్టూడియోలు, ఓటీటీ సేవలు మార్కెటింగ్ ప్రచారాల కోసం ఇక షార్ట్-వీడియో వేదికల్ని ఆశ్రయిస్తున్నాయి.

పబ్లిసిటీకి ఇక షార్ట్ వీడియోల వినియోగం!
X

వినోద రంగంలో కంటెంట్ స్టూడియోలు, ఓటీటీ సేవలు మార్కెటింగ్ ప్రచారాల కోసం ఇక షార్ట్-వీడియో వేదికల్ని ఆశ్రయిస్తున్నాయి. కంటెంట్ స్టూడియోలు, ఓటీటీ సేవలు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విస్తరించిన ప్రేక్షకుల్ని చేరుకోవడానికి, షోలు- సినిమాల విడుదలకి ముందు హైప్‌ని సృష్టించడానికీ చింగారీ, రోపోసో, ఫిల్టర్‌కాపీ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి ప్రసిద్ధ షార్ట్-వీడియో ప్లాట్‌ఫారమ్‌లతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ వేదికలకి యువత ఎంతలా దాసోహమయ్యారో తెలిసిందే. డిజిటల్ అవగాహన వున్న యువత క్రియేటర్‌లుగా తరచుగా వీక్షకుల దృష్టిని తక్షణమే ఆకర్షించే చిన్న క్లిప్స్ కోసం వినూత్న కాన్సెప్ట్ లతో లీడ్ స్టార్‌లతో కలిసి పని చేస్తూ వుంటారు. వీరి భాగస్వామ్యంతో సినిమా పాటల నుంచి, డైలాగ్ లాంచ్‌ల వరకూ షార్ట్ వీడియోలు సృష్టించ వచ్చు. ప్రత్యేకించి ఇవి రెండవ, మూడవ శ్రేణి పట్టణాల్లో రీచ్ ని పెంచడంలో బాగా సహాయపడతాయి.

అనేక సినిమా స్టూడియోల యాజమాన్యాలు, మార్కెటింగ్ నిపుణులూ ప్రచార వ్యూహాలని అభివృద్ధి చెందుతున్న ప్రేక్షకుల అభిరుచులతో మ్యాచ్ చేయడానికి, సోషల్ మీడియాని కేవలం ప్రకటనల కోసమే కాకుండా, సినిమా క్లిప్పింగ్స్ తో కంటెంట్‌ని సృష్టించి అందించడానికీ ప్రణాళికలు చేపడుతున్నారు. మార్కెటింగ్ ప్రచారాల కోసం సోషల్ మీడియాని ఉపయోగించుకునే ఈ పెరుగుతున్న ధోరణి అనేక ఉత్పత్తి కంపెనీలు ఖర్చుల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వస్తోంది.

మూవీ విక్రయదారులు, వారి భాగస్వామ్య బృందాలు తమ సినిమా స్లేట్స్ ని వినూత్న ప్రమోషన్ విధానాలతో పాటుగా, నిరంతరం విస్తృతంగా యువతకి చేరుకోవడం లక్ష్యంగా పని చేస్తున్నాయి. లైవ్-స్ట్రీమింగ్ యువతతో కనెక్ట్ అయ్యే మాధ్యమంగా అపారమైన ట్రాక్షన్‌ ని పొంది వుంది. అటువంటి భాగస్వామ్యాలు మహమ్మారి సమయంలో, 2020లో నెలకు 1-2 నుంచి ఇప్పుడు 5-6కి పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

షాపర్‌టైన్‌మెంట్ అనే ప్లాట్‌ఫారమ్ గదర్ 2, ఫైటర్, టైగర్ 3, డ్రీమ్ గర్ల్ 2, దృశ్యం 2, విక్రమ్ వేద వంటి సినిమాలతో పాటు, కాఫీ విత్ కరణ్ సీజన్ 8, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ట్రయల్, నెట్‌ఫ్లిక్స్ లో గన్స్ అండ్ గులాబ్స్ వంటి షోలతో ఇప్పటికే కలిసి పనిచేసింది. అమెజాన్ మినీ టీవీ అయితే యష్ రాజ్ ఫిల్మ్స్, వయాకామ్ 18 స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, జీ స్టూడియోస్, బాలాజీ మోషన్ పిక్చర్స్, పూజా ఎంటర్‌టైన్‌మెంట్ మాడాక్ ఫిల్మ్స్ వంటి నిర్మాణ సంస్థలతో పొత్తులు పెట్టుకుంది.

ఈ షార్ట్ వీడియోలు పాటలు, డైలాగులు ప్రమోట్ చేయడమే గాకుండా, ప్రచారంలో పెట్టిన కంటెంట్ వైరల్‌గా మారడానికి, సినిమా రీకాల్‌ శక్తిని పెంచడాకికీ కూడా సహాయపడతాయి. చింగారీ షార్ట్ వీడియో వేదిక లక్ష్మి, దృశ్యం 2, మిషన్ మజ్ను, మారిచ్, డబుల్ ఎక్సెల్, డాక్టర్ జీ, మిడిల్ క్లాస్ లవ్, కట్ పుత్లీ, దోబారా, ది లెజెండ్, ఖుదా హాఫీజ్ 2, గుడ్‌బై, మెయిన్ మోనికా వంటి అనేక సినిమాల మార్కెటింగ్ ప్రచారాలు అందించింది.

మన భదేశంలో సినిమా ప్రమోషన్‌లో సంగీతం ఎప్పుడూ పెద్ద పాత్ర పోషిస్తోంది. గత రెండు సంవత్సరాల్లో ప్రజలు షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో కొత్త సంగీతానికి అలవాటుపడ్డారు. సినిమాల్లోని జనాదరణ పొందిన పాటలు, డ్యాన్స్ హుక్ స్టెప్పులు, డైలాగుల్ని ఉపయోగించి సృష్టించిన కంటెంట్‌ బాగా వైరల్ అవుతోంది.

ఖచ్చితంగా చెప్పాలంటే, డిజిటల్ మీడియా ఇప్పుడు సినిమాల కోసం, షోల కోసం మార్కెటింగ్ వ్యూహంలో కొత్త ద్వారాల్ని తెరిచింది. సినిమాల కొత్త విడుదలల పరంగా చాలా అయోమయం వుంది. ఈ షార్ట్ వీడియోలు అయోమయం లేకుండా సినిమాల వివరాల్ని ప్రేక్షకులకి చేరవేయడానికి ప్రత్యేక మార్గంగా వుంటాయి. ఇవి అత్యంత చురుకైన, వైవిధ్యమైన యూజర్ బేస్‌ని ట్యాప్ చేసి, కంటెంట్ ని వైరల్ మార్కెటింగ్‌ ని అనువైనవిగా మార్చగలవు.

అయితే ఈ ట్రెండ్ ఇంకా సౌతిండియా వైపు కనిపించడం లేదు. త్వరలో ఈ ట్రెండ్ సౌతిండియాలో కూడా వైరల్ అవుతుందని భావించ వచ్చు.

First Published:  10 July 2024 4:40 PM IST
Next Story