Telugu Global
Cinema & Entertainment

BRO Movie - పవన్ కోసం ఊర్వశి వచ్చేసింది

Urvasi BRO Movie - తెలుగులో మరో క్రేజీ సాంగ్ ఆఫర్ అందుకుంది ఊర్వశి రౌథేలా. పవన్ తో కలిసి స్పెషల్ సాంగ్ చేస్తోంది.

BRO Movie - పవన్ కోసం ఊర్వశి వచ్చేసింది
X

పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా బ్రో. ఈ సినిమాకు సంబంధించి టోటల్ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ఒక్క సాంగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఆ ఒక్కటి కూడా స్పెషల్ సాంగ్. ఈ పాటను ఓ ప్రముఖ హీరోయిన్ తో చేయిద్దామని అనుకున్నారు. కానీ ఆమె హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఇప్పుడీ సాంగ్ కోసం ఊర్వశి రౌథేలాను తీసుకున్నారు

బ్రో సినిమా స్పెషల్ సాంగ్ లో ఊర్వశి రౌథేలా ఆడిపాడనుంచి. ఇవాళ్టి నుంచి ఈ సాంగ్ షూటింగ్ మొదలైంది. దీని కోసం ప్రత్యేకంగా ఓ సెట్ వేశారు. ఈ సెట్ లోనే షూట్ స్టార్ట్ అయింది. ముందుగా ఊర్వశి, సాయితేజ్ పై కొన్ని డాన్స్ మూమెంట్స్ షూట్ చేస్తున్నారు. రేపట్నుంచి పవన్ కల్యాణ్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది.

ఓజీ సినిమాకు ఇప్పటికే డేట్స్ కేటాయించాడు పవన్. నిన్నట్నుంచి ఆ సినిమా సెట్స్ పైకి వచ్చింది. బ్రో మూవీ సాంగ్ షూట్ ను సింగిల్ డేలో కంప్లీట్ చేసి, ఓజీ సినిమాకు షిప్ట్ అవుతాడు పవన్.

సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతోంది బ్రో సినిమా. పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళ్ లో వచ్చిన వినోదాయశితం సినిమాకు రీమేక్ ఇది.

First Published:  5 Jun 2023 11:22 AM
Next Story