Telugu Global
Cinema & Entertainment

Urvasi Ruthela | నా గ్లామర్ సీక్రెట్స్ ఇవే

Urvasi Ruthela - బాలీవుడ్ ముద్దుగుమ్మ అంత అందంగా ఎలా ఉంది. ఇన్నేళ్లయినా ఆమె శరీరాకృతి చెక్కుచెదరకపోవడానికి కారణం ఏంటి?

Urvasi Ruthela | నా గ్లామర్ సీక్రెట్స్ ఇవే
X

హీరోయిన్లు ఏం తింటారు, పొద్దున్నే లేచి ఏం చేస్తారు, ఎలాంటి కాస్మొటిక్స్ వాడతారనే విషయాలు తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఇప్పటితరం హీరోయిన్లు కూడా ఎప్పటికప్పుడు ఆ విశేషాల్ని బయటపెడుతూనే ఉంటారు. తాజాగా ఈ లిస్ట్ లోకి చేరింది హాట్ బ్యూటీ ఊర్వశి రౌథేలా.

వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ తో టాలీవుడ్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించింది ఈ బ్యూటీ. ఏజెంట్ సినిమాలో కూడా ఓ ఐటెంసాంగ్ చేసింది. ఊర్వశి తన డైట్ సీక్రెట్ ను బయటపెట్టింది. యోగా, జిమ్ తో తన రొటీన్ లైఫ్ ను స్టార్ట్ చేస్తుంది ఈ బ్యూటీ.

ప్రతి రోజూ యోగా, ప్రాణాయామం చేస్తుంది. జిమ్ మాత్రం వారానికి 3 రోజులు మాత్రమే చేస్తుంది. దీంతో పాటు సూపర్ హిట్ సాంగ్స్ కు ఇంట్లో డాన్స్ చేస్తుంది. ఇది కూడా మంచి ఎక్సర్ సైజ్ అంటోంది.

ఇక ఆహారపు అలవాట్ల విషయానికొస్తే, ఉదయం ఎగ్ వైట్ ఆమ్లెట్, ఓట్ మీల్ తో బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేస్తుంది. మధ్యాహ్నం హోమ్లీ ఫుడ్ తీసుకుంటుంది. డిన్నర్ లో తాజా పండ్లు, సలాడ్స్ తీసుకుంటుంది.

ఇక సౌందర్యానికి సంబంధించి కెమికల్స్ ఎక్కువగా ఉండే కాస్మొటిక్స్ వాడనంటోంది ఊర్వశి. ప్రకృతిసిద్ధమైన ఆర్గానిక్ ఉత్పత్తులనే మొహానికి ఫేస్ ప్యాక్ లా వాడుతుందంట. ఇదే ఊర్వశి గ్లామర్ సీక్రెట్.

First Published:  21 Jun 2024 2:15 PM IST
Next Story