Telugu Global
Cinema & Entertainment

A Movie | సంచలన చిత్రం రీ-రిలీజ్ కు రెడీ

Upendra's A-Movie - పాతికేళ్ల కిందటే సంచలన చిత్రంగా కల్ట్ స్టేటస్ అందుకున్న సినిమా A. ఇప్పుడీ మూవీ రీ-రిలీజ్ అవుతోంది.

A Movie | సంచలన చిత్రం రీ-రిలీజ్ కు రెడీ
X

ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ఏ(A) చిత్రం తెలుగులో 4కేలో గ్రాండ్‌ రీ-రిలీజ్‌కు ముస్తాబు అవుతుంది. జూన్ 21వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో రీ-రిలీజ్ చేస్తున్న సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు నిర్మాతలు. ఈ వేడుకలో చిత్ర హీరో ఉపేంద్ర పాల్గొన్నారు.

చందు ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఇప్పటికే ఛత్రపతి, యోగి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ రీరిలీజ్ చేశారు. ఆ సినిమాలు ఇచ్చిన ఊపుతో ఇప్పుడు ఏ(A) చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ రీ-రిలీజ్ కోసం బెంగళూరు వెళ్లి హీరో ఉపేంద్రను కలిసి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. ఆయన పర్మిషన్ ఇవ్వడంతో పాటు సినిమా ప్రచారానికి కూడా వచ్చారు.

ఈ చిత్రాన్ని అప్పడు ఆదరించిన ప్రేక్షకులకు, ఇప్పడు రీరిలీజ్ సైతం ఆదరించాడానికి సిద్ధంగా ఉన్న నవతరం ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు ఉపేంద్ర. 26 సంవత్సరాల క్రితం ఈ చిత్రం విడుదల అవుతున్న సమయంలో ఎంత ఉత్సాహంగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని థియేటర్లో చూసి ఇప్పటి ప్రేక్షకులు షాక్ అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఉపేంద్ర.

కన్నడ, తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఏ(A). బుద్దిమంతులకు మాత్రమే అనేది శీర్షిక. ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన చాందినీ నటించింది. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం కన్నడలో 1998లోనే 20 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. కల్ట్ స్టేటస్ అందుకున్న ఈ సినిమా 21న ఈ తరం ప్రేక్షకులముందుకొస్తోంది.

First Published:  16 Jun 2024 12:25 PM IST
Next Story