Telugu Global
Cinema & Entertainment

Allari Naresh - అల్లరి నరేష్ కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా

Allari Naresh - ఉగ్రం సినిమాను తన కెరీర్ లోనే పెద్ద సినిమాగా చెప్పుకొస్తున్నాడు అల్లరి నరేష్. అల్లరోడికి ఇదే తొలి భారీ బడ్జెట్ సినిమా.

Allari Naresh - అల్లరి నరేష్ కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా
X

ఇప్పటికే 50కి పైగా సినిమాలు చేశాడు అల్లరి నరేష్. అయితే ప్రతి సినిమాను తన మార్కెట్ కు తగ్గట్టుగానే చేశాడు. నిర్మాతలు కూడా అలానే ఖర్చుపెట్టారు. అయితే త్వరలోనే రాబోతున్న ఉగ్రం సినిమా మాత్రం తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా అంటున్నాడు అల్లరోడు.

అల్లరి నరేష్ చేస్తున్న మరో సీరియస్ సబ్జెక్ట్ ఉగ్రం. ఈ సినిమాలో పోలీస్ గా కనిపించబోతున్నాడు అల్లరి నరేష్. నాంది లాంటి సీరియస్ సినిమా తర్వాత అల్లరి నరేష్ మరోసారి అదే పంథాలో సక్సెస్ కోసం ప్రయత్నిస్తూ చేసిన సినిమా ఇది.

ఈ సినిమా కోసం అల్లరి నరేష్ మార్కెట్ ను మించి భారీగా ఖర్చు చేశారట నిర్మాతలు. ఈ విషయాన్ని అల్లరి నరేష్ స్వయంగా బయటపెట్టాడు. ఉగ్రం సినిమా తన కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ అంటున్నాడు.

"ఎక్కడా రాజీ పడకుండా ఉగ్రం సినిమాను నిర్మించారు నిర్మాతలు. నా కెరీర్ లో ఉగ్రం హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్. సమ్మర్ లో ఉగ్రం మీ ముందుకు రాబోతుంది. నాంది సినిమాని ఎంతలా ప్రోత్సహించారో అలాగే ఈ సినిమాని ప్రోత్సహించి పెద్ద హిట్ చేయాలని, ఈ టీం జర్నీ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను"

అల్లరి నరేష్, మిర్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఉగ్రం. గతంలో అల్లరి నరేష్ తో నాంది లాంటి హిట్ సినిమా తీసిన విజయ్ కనకమేడల ఈ సినిమాకు దర్శకుడు. ఈ వేసవిలోనే ఉగ్రం సినిమా థియేటర్లలోకి వస్తోంది.

First Published:  21 March 2023 8:29 AM IST
Next Story