Telugu Global
Cinema & Entertainment

Brinda | బృంద ట్రయిలర్ ఎలా ఉందంటే?

Trisha's Brinda - తొలిసారి ఓటీటీలోకి ఎంటరైంది త్రిష. ఆమె నటించిన బృంద వెబ్ సిరీస్ ట్రయిలర్ రిలీజైంది.

Brinda | బృంద ట్రయిలర్ ఎలా ఉందంటే?
X

పురుషాధిక్య ప్ర‌పంచంలో అమ్మాయిలు రాణించ‌టం క‌ష్టం. అయితే కొంద‌రు మాత్రం అలాంటి క‌ష్ట న‌ష్టాల‌కోర్చి త‌మ‌దైన ముద్ర‌ను వేస్తుంటారు. అలాంటి అరుదైన అమ్మాయే బృంద‌. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్సైగా చేరిన బృంద స‌మ‌స్య‌ల‌ను ఛేదించ‌టానికి ప్ర‌య‌త్నిస్తుంది. అయితే అవి గిట్ట‌ని పై అధికారులు ఆమెను సూటిపోటి మాట‌ల‌తో బాధ పెడుతుంటారు.

అనుకోకుండా ఓ కేసు విష‌యంలో ఆమెను స‌స్పెండ్ కూడా చేస్తారు. అస‌లు బృంద‌ను డ్యూటీ నుంచి ఎందుకు స‌స్పెండ్ చేశారు.. ఆమెకు ఎద‌ురైన స‌వాలేంటి? అనే విష‌యం తెలియాలంటే ‘బృంద’ అనే తెలుగు వెబ్‌ సిరీస్ చూడాల్సిందే.

సౌత్ క్వీన్‌ త్రిష మొట్టమొద‌టిసారి ఓటీటీ లోకి అడుగు పెట్టింది. అది కూడా తెలుగు వెబ్ సిరీస్ కావ‌టం విశేషం. సోనీ లివ్‌లో ఆగస్టు 2న బృంద వెబ్‌సీరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో రూపొందిన ఈ సిరీస్ తమిళ్‌, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీ భాష‌ల్లోనూ ఆక‌ట్టుకోనుంది. తాజాగా ట్రయిలర్ కూడా రిలీజ్ చేశారు.

డైరెక్టర్ సూర్య మ‌నోజ్ వంగాల‌తో క‌లిసి ప‌ద్మావ‌తి మ‌ల్లాది దీనికి స్క్రీన్ ప్లేను స‌మ‌కూర్చారు. శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, ఇంద్రజిత్‌ సుకుమారన్‌, జయప్రకాష్‌, ఆమని, రవీంద్ర విజయ్‌, రాకేందు మౌళి కీలక పాత్రలు పోషించారు.

First Published:  22 July 2024 10:53 AM GMT
Next Story