Trinadharao Nakkina: త్రినాధరావు నక్కినకు బంపరాఫర్
Trinadharao Nakkina to direct Chiranjeevi - చిరంజీవిని డైరక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు త్రినాధరావు నక్కిన. అయితే అతడికి ఇప్పుడో సమస్య ఎదురైంది.

ధమాకా సినిమా సక్సెస్ తో త్రినాధరావు బంపరాఫర్ అందుకున్నాడు. ఏకంగా చిరంజీవిని డైరక్ట్ చేసే అవకాశం కొట్టేశాడు. ధమాకా సక్సెస్ తర్వాత చిరంజీవి నుంచి త్రినాధరావుకు ఆఫర్ వచ్చింది. చిరంజీవిని కలిసిన నక్కిన, ఓ స్టోరీలైన్ కూడా వినిపించాడు. స్టోరీలైన్ నచ్చడంతో దాన్ని డెవలప్ చేయమని చెప్పారు చిరు.
అయితే ఇక్కడే చిక్కొచ్చి పడింది. త్రినాధరావు నక్కిన సినిమాలకు ఆది నుంచి పనిచేస్తున్న వ్యక్తి బెజవాడ ప్రసన్నకుమార్. కథ, డైలాగ్స్ ఆయనే ఇస్తూ వచ్చాడు. రీసెంట్ గా వచ్చిన ధమాకా సినిమాకు కూడా అన్నీ ఆయనే చూసుకున్నాడు. ఇప్పుడు చిరంజీవి సినిమాకు వచ్చేసరికి ఓ సమస్య వచ్చి పడింది.
నాగార్జునను డైరక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు బెజవాడ ప్రసన్నకుమార్. ధమాకా తర్వాత మరే సినిమాకు ఆయన వర్క్ చేయడం లేదు. దర్శకుడిగా సక్సెస్ కొట్టేందుకు సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు.
ఇటు చూస్తే చిరంజీవి ఆఫర్ తో నక్కిన రెడీగా ఉన్నాడు. మరి చిరంజీవి-నక్కిన సినిమాకు ప్రసన్నకుమార్ పనిచేస్తాడా చేయడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. వీళ్లిద్దరు కలిస్తేనే హిట్ కాంబినేషన్. ఇలాంటి కాంబినేషన్ ను చిరంజీవి అస్సలు వదులుకోరు.