Telugu Global
Cinema & Entertainment

Weekend Review | ఏ సినిమా నిలబడింది?

Tollywood Weekend Review - గత వారం 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏ ఒక్కటీ ఆకట్టుకోలేకపోయింది.

Weekend Review | ఏ సినిమా నిలబడింది?
X

ఈ వీకెండ్ దాదాపు అరడజను సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఏదీ ఆకట్టుకోలేకపోయింది. ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన సినిమాలు 2 ఉన్నాయి.

వీటిలో ఒకటి టెనెంట్. సత్యం రాజేష్ హీరోగా నటించిన ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. కానీ ఎగ్జిక్యూషన్ లో లోపాల వల్ల సినిమా ఆకట్టుకోలేకపోయింది. సత్యం రాజేష్, మేఘా చౌదరి, చందన నటన బాగున్నప్పటికీ.. స్క్రీన్ ప్లేలో లోపాలు సినిమాను నిలబెట్టలేకపోయాయి.

ఇక ఈ సినిమాతో పాటు.. పారిజాత పర్వం అనే సినిమా కూడా వచ్చింది. నిజానికి టెనెంట్ కంటే కాస్త ఎక్కువ అంచనాలతో వచ్చిన సినిమా ఇది. పైగా వైవా హర్ష, శ్రద్ధా దాస్, సునీల్ లాంటి తెలిసిన నటీనటులున్న మూవీ. గట్టిగా ప్రచారం చేసిన ఈ సినిమా కూడా నిలబడలేకపోయింది.

క్రైమ్ కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన పారిజాత పర్వం ఆశించిన స్థాయిలో ఎంగేజ్ చేయలేకపోయింది. క్రైమ్ చూపించాల్సిన చోట కామెడీ.. కామెడీ చూపించాల్సిన చోట క్రైమ్ చూపించి ఆసక్తి తగ్గించేశారు.

ఈ రెండు సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలొచ్చినా అవన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇక నేరుగా ఓటీటీలోకి మై డియర్ దొంగ అనే సినిమా వచ్చింది. అభినవ్ గోమటం నటించిన ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ కు కిక్ ఇవ్వలేదు.

First Published:  23 April 2024 10:47 PM IST
Next Story