November Tollywood - నవంబర్ నెలలో టాలీవుడ్ పరిస్థితేంటి..?
Tollywood November - నవంబర్ నెలలో దాదాపు 30 సినిమాలు రిలీజయ్యాయి. మరి వీటిలో ఎన్ని సినిమాలు ఆడాయి? క్లిక్ అయిన సినిమాలేంటి?
నవంబర్ బాక్సాఫీస్ టాలీవుడ్ కు కలిసిరాలేదు. ఒక్క బ్లాక్ బస్టర్ పడలేదు. నవంబర్ మొదటి వారంలో ఘోస్ట్, ప్లాట్, విధి, కీడాకోలా, నరకాసుర, శంకర్ దాదా ఎంబీబీఎస్, మిడ్ నైట్ కిల్లర్స్, ఒక్కసారి ప్రేమించాక, ద్రోహి, అనుకున్నవన్నీ జరగవు కొన్ని, పొలిమేర 2, కృష్ణఘట్టం సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో పొలిమేర-2 మాత్రమే క్లిక్ అయింది.
రెండో వారంలో జపాన్, జిగర్తాండా, అలా నిన్ను చేరి, దీపావళి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఒక్క సినిమా కూడా ఆడలేదు. ఇక మూడో వారంలో మంగళవారం, స్పార్క్, మై నేమ్ ఈజ్ శృతి, జనం, ఏ చోట నువ్వున్నా, సప్త సాగరాలు దాటి సైడ్-బి, అన్వేషి సినిమాలు రిలీజ్ అయ్యాయి.
ఈ సినిమాల్లో మంగళవారం సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది కూడా. మిగతా సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి.
నవంబర్ చివరి వారంలో ఆదికేశవ, సౌండ్ పార్టీ, మాధవే మధుసూదనా, పర్ ఫ్యూమ్, కోటబొమ్మాళి పీఎస్, ది ట్రయల్ సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో ఆదికేశవ సినిమా డిజాస్టర్ అయింది. నిర్మాతకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. సౌండ్ పార్టీ సినిమా బి, సి సెంటర్లలో ఓ మోస్తరుగా ఆడింది.
ఓవరాల్ గా నవంబర్ నెలలో పొలిమేర-2, మంగళవారం, సౌండ్ పార్టీ సినిమాలు మాత్రమే ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాయి. మిగతా సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి.