Telugu Global
Cinema & Entertainment

Tollywood Box Office Collection 2022: ఈ ఏడాది కోట్లు కొల్లగొట్టిన సినిమాలివే..

Tollywood Box Office Collections 2022: 2022లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వసూళ్లు సాధించిన పది తెలుగు చిత్రాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌.. నెంబర్ 1 ప్లేస్‌లో ఉంది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా రూ. 550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 1200 కోట్లకుపైగా వసూలు చేసింది.

Tollywood Box Office Collection 2022: ఈ ఏడాది కోట్లు కొల్లగొట్టిన సినిమాలివే
X

Tollywood Box Office Collection 2022: ఈ ఏడాది కోట్లు కొల్లగొట్టిన సినిమాలివే

ఈ ఏడాది బాక్సాఫిస్ వద్ద బోలెడు సినిమాలు హల్‌చల్ చేశాయి. కోవిడ్ ప్రభావం, ఓటీటీల వల్ల జనాలు థియేటర్లకు రారు అని చాలామంది అనుకున్నారు. కానీ కొన్ని సినిమాలు తీసుకొచ్చిన క్రేజ్ కారణంగా జనాలు థియేటర్లకు పరుగులు పెట్టారు. దీంతో కొన్ని సినిమాలు వేల కోట్ల వసూళ్లు రాబట్టాయి. ఈ ఏడాది ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్ ఓ సారి చూస్తే..

2022లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వసూళ్లు సాధించిన పది తెలుగు చిత్రాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌.. నెంబర్ 1 ప్లేస్‌లో ఉంది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా రూ. 550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 1200 కోట్లకుపైగా వసూలు చేసింది. టాలీవుడ్‌లో బాహుబలి 2 తర్వాత హయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమాగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' నిలిచింది.

ఆర్‌ఆర్‌ఆర్‌


సర్కారు వారి పాట : మహేశ్‌బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన 'సర్కారు వారి పాట' సినిమా సుమారు రూ. 60 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. దాదాపు మూడు రెట్లు అధిక వసూళ్లతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 180 కోట్లకుపైగా రాబట్టింది.

సర్కారు వారి పాట


భీమ్లా నాయక్‌ : పవన్‌ కల్యాణ్‌ హీరోగా, రానా దగ్గుబాటి విలన్‌గా తెరకెక్కిన చిత్రం 'భీమ్లా నాయక్‌' సినిమా సుమారు రూ. 70 కోట్లతో నిర్మిస్తే.. బాక్సాఫీస్ వద్ద రూ. 161 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సినిమా దర్శకుడు సాగర్ . కె.

భీమ్లా నాయక్‌


ఎఫ్ త్రీ : దర్శకుడు అనిల్‌ రావిపూడి తీసిన ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ 3 సినిమాలో వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌లు నటించారు. థియేటర్‌‌లో నవ్వులు పూయించిన ఈ సినిమా రూ. 70 కోట్ల బడ్జెట్‌తో తీస్తే బాక్సాఫీస్ వద్ద రూ. 134 కోట్లు రాబట్టింది.

ఎఫ్ త్రీ


కార్తికేయ 2: నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 సినిమా రూ. 30 కోట్ల బడ్జెట్‌కు గానూ రూ. 120 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్‌గా నిలిచింది. చందు మొండేటీ ఈ సినిమా దర్శకుడు.

కార్తికేయ 2


సీతారామం: రూ. 30 కోట్లతో సింపుల్‌గా తీసిన లవ్ స్టోరీ సీతారామం. ఈ సినిమా థియేటర్‌‌లో మ్యాజిక్ చేసి సుమారు రూ. 90 కోట్లకుపైగా వసూలు చేసింది. హను రాఘవపూడి తీసిన ఈ సినిమా ఈ ఏడాది క్లాసిక్‌గా నిలిచింది.

సీతారామం


ఇక వీటితో పాటు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తీసిని బింబిసార రూ. 65 కోట్లు, వంద కోట్లతో తీసిన గాడ్ ఫాదర్ రూ. 150 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకున్నాయి.

First Published:  30 Dec 2022 12:47 PM GMT
Next Story