Telugu Global
Cinema & Entertainment

June Box Office | ఈ నెలలో రాబోయే చిత్రాలు

Tollywood June Month Releases - జూన్ నెల టాలీవుడ్ కు కీలకం కాబోతోంది. దీనికి కారణం కల్కి.

June Box Office | ఈ నెలలో రాబోయే చిత్రాలు
X

సమ్మర్ బాక్సాఫీస్ వృధా అయింది. ఇప్పుడు అందరి కళ్లు జూన్ బాక్సాఫీస్ పై పడ్డాయి. మరి ఈ నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలేంటి? ఈ నెల మొదటివారంలో, అంటే ఈ శుక్రవారం.. మనమే, సత్యభామ, లవ్ మౌళి, రక్షణ, ఏ మాస్టర్ పీస్, వెపన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ఈ అరడజను సినిమాల్లో మనమే, సత్యభామ సినిమాలు ఆకర్షిస్తున్నాయి. శర్వానంద్-కృతి శెట్టి జంటగా మనమే సినిమా తెరకెక్కగా.. తొలిసారి కాజల్ లీడ్ రోల్ లో సత్యభామ సినిమా తెరకెక్కింది. ఇక రెండో వారంలో రాయన్, ఇంద్రాణి, హరోంహర, మ్యూజిక్ షాప్ మూర్తి, యేవమ్ సినిమాలొస్తున్నాయి.

ఇక్కడ కూడా కొన్ని ప్రత్యేకతలున్నాయి. ధనుష్ 50వ చిత్రం రాయన్ కాగా.. సుధీర్ బాబు నటించిన సినిమా హరోంహర. ఈ రెండు సినిమాలు టీజర్, ట్రయిలర్ తో ఆకట్టుకున్నాయి. ఇక మూడో వారానికి ప్రస్తుతానికి సినిమాలేవీ షెడ్యూల్ కాలేదు. ఎందుకంటే, నాలుగో వారంలో కల్కి సినిమా వస్తోంది.

ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా కోసం రిలీజ్ కు ముందు ఒక వారం, రిలీజ్ తర్వాత మరో వారం గ్యాప్ ఇవ్వబోతున్నారు. అలా జూన్ నెలలో చాలా సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే అందరి చూపు కల్కి సినిమాపైనే ఉంది. ఈ సినిమా హిట్టయితే టాలీవుడ్ మార్కెట్ మరింత విస్తరిస్తుంది. లేదంటే స్లంప్ లో పడుతుంది.

First Published:  3 Jun 2024 4:47 PM GMT
Next Story