Tiger Nageswara Rao | 5 భాషల్లో ఒకేసారి రిలీజైన పాట
Tiger Nageswara Rao - రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది.

మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్‌లో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. భారతదేశంలోని అతిపెద్ద దొంగ నాగేశ్వరరావు బయోపిక్ ఇది. జనాలకు తెలియని అతడిలోని మరో కోణాన్ని కూడా ఇది ఆవిష్కరిస్తుంది.
టైగర్ నాగేశ్వరరావు ప్రేయసి సారా పాత్రలో నుపుర్ సనన్ లుక్ ను ఇది వరకే మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ సింగల్ ని సౌత్ ఇండియా భాషలు, హిందీలో విడుదల చేయడం ద్వారా సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లను గ్రాండ్ గా ప్రారంభించారు.
’ఏక్ దమ్ ఏక్ దమ్' పాట పెప్పీయెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా నిలవనుంది. ప్రేక్షకులు, మ్యూజిక్ లవర్స్ పల్స్ తెలిసిన కంపోజర్స్ లో జివి ప్రకాష్ కుమార్ ఒకరు. ఏక్ దమ్ ఏక్ దమ్ పాటలో డ్యాన్స్ రిథమ్స్ బాగున్నాయి. జివి తన ఇన్‌స్ట్రుమెంటేషన్, కంపోజిషన్ తో పాటకు రెట్రో అనుభూతిని తీసుకొచ్చాడు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఆ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి అలపించాడు.
కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాటలో రవితేజ.. తన ప్రేయసి పాత్రని పోషించిన నూపుర్ సనన్ ని ఆట పట్టిస్తూ కనిపించాడు. రవితేజ యంగ్ లుక్, అతడి డాన్స్ బాగుంది. గా కనిపించారు. కాస్ట్యూమ్స్, సెట్లు కూడా రెట్రో ఫీల్ ఇచ్చాయి. వినగానే ఆకట్టుకునేలా ఉంది ఈ సాంగ్.
ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు.