Tiger 3 box office collection | సల్మాన్ ఖాన్ సినిమాకు రూ. 300 కోట్లు
Tiger 3 box office collection | సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సినిమా టైగర్-3. విడుదలైన 6 రోజుల్లో ఈ సినిమా 300 కోట్ల క్లబ్ లోకి చేరింది.
Tiger 3 box office collection | టైగర్ 3 ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్కును దాటింది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై, స్పై యూనివర్స్‌లో భాగంగా సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా.. ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించిన టైగర్ 3 సినిమా.. భారతదేశంలో 6 రోజుల్లో 200 కోట్లు దాటింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 324 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలా టైగర్ 3 300 కోట్ల క్లబ్ లో చేరింది. టైగర్ 3 విడుదలైన 6వ రోజున ఏక్ థా టైగర్ లైఫ్ టైమ్ వసూళ్లు (318.19 కోట్లు)ను క్రాస్ చేసింది.
తాజా లెక్కల ప్రకారం, ఈ సినిమాకు దేశవ్యాప్తంగా 245 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. ఓవర్సీస్ లో 79 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఓవరాల్ గా ఈ సినిమా వరల్డ్ వైడ్ 324 కోట్ల రూపాయలు రాబట్టింది.
చెప్పుకోడానికి వసూళ్లు బాగానే ఉన్నాయి కానీ, సల్మాన్ ఖాన్ ఇమేజ్, ఇతర సినిమాల రికార్డుల్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇది ఏమాత్రం సరిపోదు. టైగర్-3కి ఆల్రెడీ మిక్స్ డ్ టాక్ వచ్చేసింది. మరోవైపు వారం రోజుల రన్ పూర్తిచేసుకోబోతోంది. ఈ క్రమంలో రెండో వారం ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశమైంది.
అటు చూసుకుంటే.. పఠాన్, జవాన్, గదర్ 2 సినిమాలు 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో సల్మాన్ కు టార్గెట్ ఫిక్స్ చేశాయి. ఇప్పుడీ సినిమాల సరసన చేరాలంటే.. సల్మాన్ ఖాన్ మూవీ కనీసం మరో 10 రోజులైనా 60శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడవాలి. అది సాధ్యమా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం.