Telugu Global
Cinema & Entertainment

Weekend Release| వీకెండ్ రిలీజ్ - 9 సినిమాలు

Weekend Release - ఈ వీకెండ్ ఏకంగా 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 2 సినిమాలు ఆకర్షిస్తున్నాయి.

Weekend Release| వీకెండ్ రిలీజ్ - 9 సినిమాలు
X

ఈ వీకెండ్ ఏకంగా 9 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఆగస్ట్ 15 తర్వాత థియేటర్లు ఖాళీ లేకపోవడం, అక్కడ్నుంచి వరుసగా పెద్ద సినిమాలు క్యూలో ఉండడంతో, చిన్నాచితకా సినిమాల్ని ఈ వారం, వచ్చే వారం రిలీజ్ చేసేయాలని చిన్న నిర్మాతలు భావిస్తున్నారు.

ఇందులో భాగంగా ఈ శుక్రవారం ఏకంగా 9 సినిమాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిలో కొన్ని సినిమాలపై అంచనాలున్నాయి. ఆ సినిమాలేంటో చూద్దాం..

లాంగ్ గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ నుంచి వస్తున్న సినిమా బడ్డీ. ఓ టెడ్డీ బేర్, శిరీశ్ కలిసి చేసే సాహసాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు టికెట్ రేట్లు తగ్గించి మరీ ప్రేక్షకుల్ని ఆహ్వానిస్తోంది యూనిట్. అటు అశ్విన్ బాబు హీరోగా నటించిన శివం భజే సినిమా కూడా ట్రయిలర్ తో ఆకట్టుకుంటోంది.

ఈ రెండు సినిమాలు కాకుండా.. విరాజీ, తుఫాన్, ఉషా పరిణయం సినిమాలు కూడా వస్తున్నాయి. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన సినిమా విరాజీ. ఇక సీనియర్ దర్శకుడు విజయ్ భాస్కర్, తన కొడుకును హీరోగా పెట్టి తీసిన సినిమా ఉషా పరిణయం. అటు విజయ్ ఆంటోనీ ఎప్పట్లానే మరో సినిమాతో రెడీ అయ్యాడు. దాని పేరు తుఫాన్.

ఈ సినిమాలతో పాటు.. అలనాటి రామచంద్రుడు, యావరేజ్ స్టూడెంట్ నాని, లారి సినిమాలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇక రీ-రిలీజెస్ విషయానికొస్తే.. ఈ వీకెండ్ నాని-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా థియేటర్లలోకి వస్తోంది.

First Published:  29 July 2024 2:00 PM IST
Next Story