This week OTT Releases: ఈవారం ఓటీటీదే పైచేయి
This week OTT releases Telugu Movies: సంక్రాంతి కి సందడి చేసిన మూవీస్ అన్నీ ఇప్పుడు OTT కి క్యూ కట్టాయి

This week OTT Releases: ఈవారం ఓటీటీదే పైచేయి
ఈవారం థియేటర్లలో పెద్దగా సందడి లేదు. సందడి మొత్తం ఓటీటీలోనే కనిపిస్తోంది. సంక్రాంతి సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇందులో భాగంగా వారసుడు సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
మరో సంక్రాంతి సినిమా వీరసింహారెడ్డి కూడా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. హాట్ స్టార్ లో నిన్నట్నుంచి వీరసింహారెడ్డి సినిమా అందుబాటులోకి వచ్చింది. బాలకృష్ణ-శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించారు.
ఇక సంక్రాంతి విన్నర్ వాల్తేరు వీరయ్య మాత్రం ఓటీటీలోకి రావడానికి ఇంకాస్త టైమ్ తీసుకుంటోంది. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పటికే కొన్ని సెంటర్లలో రన్ అవుతోంది. అందుకే కాస్త ఆలస్యంగా 27వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు పెడుతున్నారు.
ఈ సినిమాలతో పాటు ఇవాళ్టి నుంచి మైఖేల్ మూవీ ఆహాలో అందుబాటులోకి రాబోతోంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చింది. తొందరగానే ఓటీటీలోకి వచ్చేస్తోంది.