Telugu Global
Cinema & Entertainment

ఈవారం ఓటీటీ వాచ్ లిస్ట్ – 17 సినిమాలతో పండుగ!

ఈవారం తెలుగు సినిమాలు ఈగల్’, బూట్ కట్ బలరాజుతో బాటు తమిళ సినిమా బ్లూ స్టార్’ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఈవారం ఓటీటీ వాచ్ లిస్ట్ – 17 సినిమాలతో పండుగ!
X

ఈవారం (ఫిబ్రవరి 27- మార్చి3) భారీ సంఖ్యలో మార్కెట్ లోకొస్తున్న ఓటీటీలు 19 సినిమాలు, 17 వెబ్ సిరీస్ లు మోసుకొచ్చాయి. ఒకవైపు జియో సినిమా- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విలీనం కొలిక్కి వస్తే, మరోవైపు అల్లు అరవింద్ ఆధ్వర్యంలోని ఆహా అమ్మకానికి పెట్టినట్టు వార్తలొస్తున్నాయి. 2023 లో మనదేశంలో ఓటీటీ మార్కెట్ 2.5 బిలియన్ డాలర్లకి చేరుకుంటే, ఇది 2029 కల్లా 5.81 బిలియన్ డాలర్లకి చేరుకోగలదని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో విలీనాలు, అమ్మకాలు, కొత్త బ్రాండ్ ల ఆగమనాలూ కలుపుకుని పురోగతి దిశగానే మార్కెట్ పయనిస్తుంది తప్ప, కొంతకాలం క్రితం ఊహించినట్టు కుప్పకూలే పరిస్థితి రాదు. ఎలా తయారయిందంటే, ప్రేక్షకులు సినిమాల కోసం థియేటర్లకి వెళ్ళడం పూర్తిగా మానేస్తారేమో గానీ ఓటీటీల్ని పోషించడం మాత్రం వదులుకోరు. శక్తికి మించి కూడా పోషిస్తారు. అందుకే 5.81 బిలియన్ డాలర్ల (రూ. 4,81,60,60,06,000) దారి పట్టబోతోంది మార్కెట్. వారం వారం వందల కొద్దీ సినిమాలు, సిరీస్ లు, షోలు, డాక్యుమెంటరీలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఈ వారం ఇంగ్లీషు, హిందీ, కొరియన్, ఫ్రెంచి, పోలిష్, టర్కిష్, మాండరిన్, థాయ్ భాషల్లో కంటెంట్ ని మార్కెట్లో గుప్పించారు. ఈవారం తెలుగు సినిమాలు ఈగల్’, బూట్ కట్ బలరాజుతో బాటు తమిళ సినిమా బ్లూ స్టార్’ స్ట్రీమింగ్ అవుతున్నాయి. పూర్తి వివరాలతో వాచ్ లిస్ట్ ఈ క్రింద...

తెలుగు, తమిళం సినిమాలు 3

1. ఈగల్ తెలుగు మూవీ)- ఈటీవీ విన్- మార్చి 2

2. బూట్ కట్ బాలరాజు (తెలుగు మూవీ) -ఆహా - ఫిబ్రవరి 27

3. బ్లూ స్టార్ (తమిళం మూవీ) – అమెజాన్ ప్రైమ్- ఫిబ్రవరి 27

నెట్‌ఫ్లిక్స్ లో 18

1. ఇండిగో (ఇండోనేసియన్ మూవీ) – ఫిబ్రవరి 27

2. అమెరికన్ కాన్స్ పిరసీ : ది అక్టోపస్ మర్డర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 28

3. కోడ్ 8 పార్ట్ 2 (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 28

4. ది మైర్ సీజన్ 3 (పోలిష్ సిరీస్) – ఫిబ్రవరి 28

5. ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ (టర్కిష్ సిరీస్) – ఫిబ్రవరి 29

6. మన్ సూఆంగ్ (థాయ్ లాండ్ సినిమా) – ఫిబ్రవరి 29

7. ది ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (డాక్యుమెంటరీ సిరీస్) – ఫిబ్రవరి 29

8. ఫ్యూరిస్ (ఫ్రెంచ్ సిరీస్) – ఫిబ్రవరి 29

9. ది టూరిస్ట్- సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)- ఫిబ్రవరి 29

11. బ్లడ్ అండ్ వాటర్ –సీజన్ 4 (టీనేజి సిరీస్)- మార్చి 1

12. మామ్లా లీగల్ హై (హిందీ వెబ్‌ సిరీస్) – మార్చి 1

13. మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ ‍(కొరియన్ సినిమా) – మార్చి 1

14. షేక్, ర్యాటెల్ అండ్ రోల్: ఎక్స్‌ట్రీమ్ (సినిమా) – మార్చి 1

15. సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 (ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్) – మార్చి 1

16. స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 1

17. ది పిగ్ ది స్నేక్ అండ్ ది పిజియన్ (మాండరిన్‌ మూవీ) – మార్చి 01

18. ది నెట్‌ఫ్లిక్స్ స్లామ్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 03

అమెజాన్ ప్రైమ్ లో 7

1. బ్లూ స్టార్ (తమిళం మూవీ)- ఫిబ్రవరి 27

2. వెడ్డింగ్ ఇంపాసిబుల్ (కొరియన్ వెబ్‌ సిరీస్) – ఫిబ్రవరి 26

3. ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 26

4. పూర్ థింగ్స్ (ఇంగ్లీష్‌ సినిమా) – ఫిబ్రవరి 27

5. పా పాట్రోల్: ది మైఠీ మూవీ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 29

6. రెడ్ క్వీన్ (స్పానిష్ వెబ్‌ సిరీస్) – ఫిబ్రవరి 29

7. నైట్ స్విమ్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 1

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో 4

1. ఇవాజు (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 28

2. షోగున్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 28

3. ది ఇంపాసిబుల్ హెయర్ (కొరియన్ సిరీస్) – ఫిబ్రవరి 28

4. వండర్‌ఫుల్ వరల్డ్ (కొరియన్ సిరీస్) – మార్చి 1

జీ5 లో 1

1. సన్‌ఫ్లవర్ సీజన్ 2 (హిందీ సిరీస్) – మార్చి 1

జియో సినిమాలో 1

1. ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 27

బుక్ మై షో లో 1

1. ఫియర్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 27

ఆపిల్ ప్లస్ టీవీ లో 2

1. నెపోలియన్ (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 1

2. ది కంప్లీట్లీ మేడ్-అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్పిన్ (ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్‌) – మార్చి 01

ముబీ లో 1

1. ప్రిసిల్లా (ఇంగ్లీష్ మూవీ ) – మార్చి 1

ఎఫ్ ఎక్స్ హులూలో 1

1. షాగన్ (ఇంగ్లీష్ హిస్టారికల్ సిరీస్)- ఫిబ్రవరి 27

సిబిఎస్ లో 2

1. సర్వైవర్ సీజన్ 46 ఇంగ్లీష్ సిరీస్)- ఫిబ్రవరి 28

2. ఎల్స్ బెత్ ( ఇంగ్లీష్ సిరీస్)- ఫిబ్రవరి 29

First Published:  27 Feb 2024 12:39 PM IST
Next Story