Telugu Global
Cinema & Entertainment

ముగింపు ద‌శ‌కు దేవ‌ర‌.. ఇక బ్యాలెన్స్ ఉన్న‌వి అవే!

తాజా స‌మాచారం ప్ర‌కారం.. దేవ‌ర ఫ‌స్ట్ ఫార్ట్ షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది.

ముగింపు ద‌శ‌కు దేవ‌ర‌.. ఇక బ్యాలెన్స్ ఉన్న‌వి అవే!
X

ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబ‌ల్‌ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో రెండు భాగాలుగా రాబోతున్న తొలి చిత్ర‌మిది. ఇందులో బాలీవుడ్ భామ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. సైఫ్ అలీ ఖాన్, రమ్యకృష్ణ, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు అందిస్తున్నారు.

దేవ‌ర పార్ట్ 1ను మొద‌ట 2024 ఏప్రిల్ లో విడుద‌ల చేయాలని భావించారు. కానీ షూటింగ్ ఆల‌స్యంగా ప్రారంభం కావ‌డం వ‌ల్ల రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేశారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. దేవ‌ర ఫ‌స్ట్ ఫార్ట్ షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం సినిమాలోని ఒక కీల‌కమైన యాక్ష‌న్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నార‌ట‌. ఈ యాక్ష‌న్ సీక్వెన్స్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు షైన్ టామ్ చాకో, శ్రీ‌కాంత్‌, ప్ర‌కాష్ రాజ్ వంటి ముఖ్య తారాగ‌ణం పాల్గొంటున్నారు.

ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంట‌నే ఫారిన్‌ లొకేషన్స్ లో ఎన్టీఆర్‌ - జాన్వీ కపూర్ లపై సాంగ్స్‌ చిత్రీకరణ చేస్తారట. దాంతో దేవర పార్ట్‌ 1 టాకీ పార్ట్ మొత్తం పూర్తి అవుతుందని అంటున్నారు. ఆగ‌స్టు లోపే ఈ బ్యాలెన్స్ షూటింగ్ మొత్తాన్ని కొర‌టాల కంప్లీట్ చేయ‌నున్నార‌ని కూడా తెలుస్తోంది. కాగా, ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై దేవ‌ర మూవీ నిర్మితం అవుతోంది. రూ. 120 కోట్ల బ‌డ్జెట్ తో రూపుదిద్దుకున్న దేవ‌ర పార్ట్ 1 ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 27న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంది.

First Published:  1 July 2024 2:57 PM IST
Next Story