Dasara movie - దసరా నుంచి మూడో సాంగ్ రెడీ
Dasara Movie - నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మూడో పాట రెడీ అయింది.

నాని, దర్శకుడు శ్రీకాంత్ ఒదెల పాన్ ఇండియా చిత్రం దసరా. ఫస్ట్-లుక్ పోస్టర్ నుంచి టీజర్ వరకూ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ సినిమా. మరీ ముఖ్యంగా మొదటి రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దసరా నుంచి మూడో సింగిల్ వస్తోంది.
సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న దసరా చిత్రంలోని మూడో పాటను మార్చి 8న విడుదల చేయనున్నారు. ఇది ప్రతి పెళ్లిళ్ల సీజన్‌కి సరిపోయే జానపద పాట. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ లో నాని దసరా బుల్లోడుగా కనిపిస్తుండగా, కీర్తి సురేష్ చీరలో అందంగా కనిపించింది.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దసరా చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.