Tarakarama Theatre: మోక్షజ్ఞకు 'తారకరామ'కు లింక్ ఏంటి?
Mokshagna: తారకరామ థియేటర్ కు, మోక్షజ్ఞ పేరుకు ఓ లింక్ ఉంది. అదేంటో స్వయంగా బాలకృష్ణ బయటపెట్టారు.

నందమూరి కుటుంబానికి చెందిన తారకరామ థియేటర్ మరోసారి ప్రారంభమైంది. ఏషియన్ తారకరామ పేరుతో, సరికొత్త టెక్నాలజీని యాడ్ చేస్తూ, మంచి సీటింగ్ తో ఈ థియేటర్ ను మరోసారి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. బాలకృష్ణ చేతుల మీదుగా ఈ సినిమా హాల్ తాజాగా ప్రారంభమైంది.
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు బాలకృష్ణ. తన కొడుకు మోక్షజ్ఞకు, ఈ థియేటర్ కు ఉన్న అవినాభావ సంబంధాన్ని బయటపెట్టాడు.
మోక్షజ్ఞ అసలు పేరు మోక్షజ్ఞ తారకరామ తేజ. ఈ పేరును బాలయ్య తండ్రి నందమూరి తారకరామరావు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ నామకరణ కార్యక్రమం స్వయంగా తారకరామ థియేటర్ లో జరిగిందని వెల్లడించారు బాలయ్య.
అందుకో మోక్షజ్ఞకు తారకరామ అనే పేరును కూడా జతచేసి పెట్టారని తెలిపారు బాలయ్య. అలా తారకరామ థియేటర్ లో మోక్షజ్ఞ నామకరణం జరిగిందట. తారకరామ థియేటర్ లాంఛ్ అయినట్టే, మోక్షజ్ఞ కూడా ఇదే సీజన్ లో హీరోగా ఎంట్రీ ఇస్తాడేమో.