The Kerala Story - వంద కోట్ల క్లబ్ లో చేరిన కేరళ స్టోరీ
The Kerala Story - వివాదాస్పద కేరళ స్టోరీ సినిమా సూపర్ హిట్టయింది. థియేటర్లలో ఈ సినిమాను చాలామంది చూస్తున్నారు. అలా వంద కోట్లు ఆర్జించింది ఈ మూవీ.
వివాదాస్పద చిత్రం కేరళ స్టోరీ, థియేటర్లలో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా వంద కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరింది. నిన్న ఈ సినిమాకు 19 కోట్ల 50 లక్షల రూపాయల నెట్ వచ్చింది. ఈ వసూళ్లతో కలిపి కేరళ స్టోరీ సినిమాకు 112 కోట్ల 87 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టయింది.
సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అదాశర్మ, సిద్ధి ఇద్నానీ, యోగిత, సోనియా లీడ్ రోల్స్ పోషించారు. సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై విపుల్ అమృత్ లాల్ షా ఈ సినిమాను నిర్మించారు. మూవీ ఇలా రిలీజ్ అవ్వగానే, కేరళలో బ్యాన్ అయింది. ఆ వెంటనే తమిళనాడు ప్రభుత్వం కూడా దీన్ని బ్యాన్ చేసింది.
అయినప్పటికీ ఇతర ప్రాంతాల్లో ఈ సినిమా సూపర్ హిట్టయింది. కేరళలో కొన్నేళ్లుగా 32వేల మంది మహిళలు అదృశ్యమయ్యారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. త్వరలోనే ఈ మూవీని అంతర్జాతీయ స్థాయిలో కూడా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాకు ఎలాంటి ప్రచారం చేయడం లేదు మేకర్స్. కేవలం కొన్ని ప్రాంతాల్లో యువత, మేధావులతో చర్చావేదికలు మాత్రమే నిర్వహిస్తున్నారు. తమ సినిమాకు ప్రచారం అక్కర్లేదని అంటున్నారు వీళ్లు. ఆసక్తి ఉన్నవాళ్లు వచ్చి చూస్తారని, తమకు కేవలం మౌత్ టాక్ చాలని చెబుతున్నారు.