ఐటీ సోదాలు నా ఒక్కడిపైనే జరగలేదు
90 శాతం టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నారు. ఇక బ్లాక్ మనీ సమస్యే లేదన్న దిల్ రాజు
ఐటీ దాడులపై ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు స్పందించారు. ఈ నాలుగు రోజుల నుంచి ఈ విషయంపై ఆసక్తి చూపెడుతున్నారు. తెలిసీ తెలియని విషయాలతో దీన్ని బాగా హైలెట్ చేస్తున్నారు. 2008లో ఒకసారి ఐటీ శాఖ దాడులు చేసింది. సుమారు 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు మా ఇళ్లు, ఆఫీసులపై ఈ దాడులు జరిగాయి. మధ్యలో మూడుసార్లు సర్వేలు చేసి అకౌంట్ బుక్ చెక్ చేశారు. వ్యాపార రంగంలో ఉన్నవారిపై ఇలాంటి దాడులు సాధారణం. ఈ మూడు దాడుల్లో మా ఇల్లు, ఆఫీసులో ఇంత డబ్బు దొరికింది.. ఏవోవో డాక్యుమెంట్లు దొరికాయంటూ కొన్ని ఛానల్స్‌లో వార్తలు హైలెట్ చేశారు. మా దగ్గర అలాంటిది ఏమీ జరగలేదు. మా వద్ద ఎలాంటి అనధికారిక డాక్యుమెంట్లు, డబ్బును అధికారులు గుర్తించలేదన్నారు.తన వద్ద, తన కూతురు, శిరీష్ మా ముగ్గురి వద్ద మొత్తం కలిపితే రూ. 20 లక్షల రూపాలయ నగదు మాత్రమే ఉన్నదన్నారు.
ఐదేళ్లుగా తాము ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదన్నారు. ఐటీ అధికారులు అడిగిన వివరాలన్నీ ఇచ్చినట్లు వివరించారు. సినిమాకు సంబంధించి వివరాలు అడిగారని, ఇచ్చామన్నారు. మేం ఇచ్చిన పత్రాలన్నీ వాళ్లు తనిఖీ చేస్తారు. ఐటీ సోదాలు నా ఒక్కడిపైనే జరగలేదు కదా అని ప్రశ్నించారు. నిబంధనల ప్రకరామే వాళ్లు సోదాలు జరిపారు. 90 శాతం టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నారు. ఇక బ్లాక్ మనీ సమస్యే లేదని దిల్ రాజు తెలిపారు. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రిలో చేర్చాం. ఇప్పుడు బాగానే ఉన్నారు. తప్పుడు వార్తలు రాయవద్దని దిల్ రాజు మీడియాను కోరారు.